Mahesh Babu Guntur Kaaram Review : అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ 'గుంటూరు కారం'. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ప్రీమియర్స్ పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియా(Guntur Kaaram Twitter Review) వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా బాగుందని కొంతమంది చెబుతుంటే - రొటీన్ కథ అని, మహేశ్ స్థాయి సినిమా కాదని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
కథలోకి వెళితే - సినిమాలోని బలమైన పాయింట్‌ను మొదటి పది నిమిషాల్లోనే రివీల్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్ ఆ వెంటనే హీరోను ఇంట్రడ్యూస్ చేసి థియేటర్‌లో ఎక్సైటింగ్ మూమెంట్స్‌ను తీసుకొచ్చారు. మహేశ్ ఎప్పటిలాగే తన మార్క్ ఎంట్రీ, యాక్షన్, కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా నటింటారు.
ఫస్ట్ ఆఫ్‌లో నాది నెక్లెస్ గొలుసు, ఒక్కడు పాటలకు శ్రీలీల వేసిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. మహేశ్ - శ్రీలీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా క్లాసీగా సెటైరికల్ డైలాగ్స్‌తో ఫీల్ అండ్ ఫన్ను క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్‌తో ఫస్ట్ ఆఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై మరింత అంచనాలను, ఆసక్తిని పెంచేశారు.