తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

IMDBలో అతి తక్కువ రేటింగ్ ఉన్న మూవీ ఏదో తెలుసా? - ఐఎండీబీలోయెస్ట్​రేటెడ్​ఇండియన్​మూవీ

Lowest IMDB Rated Bollywood Movie : ఏదైనా సినిమా విడుదలైతే ఆడియెన్స్​ తొలుత మూవీ రివ్యూను చూస్తారు. మరికొంత మంది అయితే రేటింగ్స్​ను గమనిస్తారు. ఈ రెండు అంశాలు ఓ సినిమా బాగుందా లేదా అన్న విషయాన్ని ఆడియెన్స్​కు తెలియజేస్తుంది. అయితే ప్రముఖ సంస్థ IMDB లెక్కల ప్రకారం బాలీవుడ్​కు చెందిన ఓ మూవీ లోయెస్ట్​ రేటింగ్​ నమోదు చేసుకుని నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ?

Lowest IMDB Rated Movie
Lowest IMDB Rated Movie

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 11:49 AM IST

Updated : Jan 17, 2024, 2:23 PM IST

Lowest IMDB Rated Bollywood Movie :ఒక సినిమా బాగుందా లేదా అన్న విషయాలను తెలుసుకునేందుకు ఆడియెన్స్​ రివ్యూలతో పాటు రేటింగ్స్​ను చూస్తుంటారు. దాని ద్వారా ఆ సినిమా రిజల్ట్​ను పరిగణిస్తారు. అయితే చాల మంది సినీ ప్రియులు IMDb ( Internet Movie Database) అనే సంస్థ ఇచ్చే రేటింగ్​ను ప్రామాణికంగా తీసుకుంటుంటారు. ఎక్కువ IMDb రేటింగ్ ఉంటే అది మంచి సినిమా అని తక్కువ రేటింగ్ ఉంటే బాక్సాఫీస్ వద్ద నిరాశగా మిగిలిన సినిమాగా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు తక్కువ రేటింగ్​తో ఈ డేటాబేస్​లో ఎన్నో సినిమాలు నమొదయ్యాయి. మరి అత్యంత తక్కువ రేటింగ్​ అందుకున్న సినిమా ఏంటో తెలుసా? అది ఓ బాలీవుడ్ సినిమా.

2008లో విడుదలైన 'దేశ ద్రోహి' చిత్రం బాలీవుడ్ చరిత్రలో అత్యంత తక్కువ IMDb రేటింగ్ గల చిత్రంగా రికార్డుకెక్కింది. జగదీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్(KRK) లీడ్ రోల్​లో కనిపించారు. రాజ్ యాదవ్ అనే పాత్రలో ఆయన నటించారు.

స్టోరీ ఏంటంటే ?
Des Drohi Movie Story : రాజా యాదవ్ అనే వ్యక్తి పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి ముంబయి వెళ్తాడు. అక్కడ అతడికి సోనియా పాటిల్ అనే మహిళతో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త కొద్ది రోజులకే ప్రేమగా మారుతుంది. అయితే ఆమె బాబా కదమ్ అనే డ్రగ్​ డీలర్ వద్ద పని చేస్తుంటుంది. కదమ్​కు రాజన్ నాయక్ అనే శత్రువు ఉంటాడు. ఒకరోజు అతడు బాబా కదమ్​పై దాడికి పాల్పడగా అందులో సోనియా ఇరుక్కుంటుంది. దీంతో అక్కడి నుంచి సోనియాను కాపాడేందుకు రాజా పోరాడుతాడు. ఆఖరికి ఆమెను రక్షిస్తాడు.

అయితే ఆ తర్వాత ఓ మంత్రి వద్దకు వెళ్లి తనకు సహాయం చేయమని కోరుతాడు రాజా. ఈ నేపథ్యంలో మరో విలన్ అయిన​ రాజన్ నాయక్​కు టార్గెట్​గా మారుతాడు. దీంతో తనకు, సోనియాకు సహాయం చేయడానికి ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకున్న రాజా పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా స్టోరీ. అయితే ఈ సినిమాలోనీ ఏ ఒక్క అంశం కూడా ఆడియెన్స్​ను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఐఎండీబీ ఈ చిత్రానికి 1.2 రేటింగ్​ ఇచ్చింది. ఇది ఇప్పటి వరకు బాలీవుడ్​లో నమోదైన అత్యల్ప రేటింగ్​ చిత్రంగా చరిత్రకెక్కింది. మరోవైపు 'దేశ ద్రోహి'తో పాటు లోయెస్ట్ రేటెడ్​ బాలీవుడ్ మూవీస్​లో 'రామ్ గోపాల్ వర్మ కీ ఆగ్' (1.4), 'హమ్‌షాకల్స్', 'హిమ్మత్‌వాలా'(1.7), 'రేస్ 3' (1.9) సినిమాలు ఉన్నాయి.

సౌత్​లో రికార్డు సృష్టించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదంటే?

3ఇడియట్స్​, దంగల్​ కాదు- ఓవర్సీస్​లో రూ.100కోట్లు రాబట్టిన ఫస్ట్ ఇండియన్​​ మూవీ ఏంటో తెలుసా?

Last Updated : Jan 17, 2024, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details