Pooja Hegde Movies : 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో 'ముకుందా' సినిమాలో నటించి టాలీవుడ్ ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లలో టాలీవుడ్లో క్రేజ్ సంపాందిచుకుంది. 'అల వైకుంఠపురం', 'దువ్వాడ జగన్నాథం', 'మహర్షి', 'గద్దల కొండ గణేష్' లాంటి సినిమాల్లో నటించి.. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అంత వరకు బాగుందని అనుకున్న ఈ చిన్నదాని కెరీర్లో అనుకోని ట్విస్ట్‌లు వచ్చాయి. 2021లో అఖిల్ హీరోగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' యావరేజ్ టాక్ అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన 'రాధే శ్యామ్', 'బీస్ట్','ఆచార్య' సినిమాలు బాక్సాఫీస్ ముందు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో ఈ బ్యూటీ స్లోగా బాలీవుడ్ వైపునకు అడుగులేసింది.
Pooja Hegde Bollywood Movies: అప్పటికే 'మోహంజదారో', 'హౌస్‌ఫుల్ 4' ద్వారా బీటౌన్ ఆడియన్స్‌కు చేరువైన ఈ తార.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'కిసీ కా భాయ్ కిసీకి జాన్' సినిమాతో మరోసారి హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సరైన వేదిక అని అనుకున్న ఈ చిన్నదానికి ఆ సినిమాతో కూడా నిరాశే ఎదురైంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ టాలీవుడ్‌కు వచ్చేసింది. మహేశ్ సరసన 'గుంటూరు కారం', పవన్ కల్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో అవకాశాన్ని అందిపుచ్చుకుని సేఫ్ సైడ్‌లోకి వెళ్లిపోయింది.