Leo Tiger Nageswara Rao Boxoffice Collections : దళపతి విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'లియో'. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా టాక్ పరంగా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 400 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన ఈ సినిమా.. ఆరో రోజుకు రూ. 500 కోట్ల మార్క్‌ను దాటేసిందని తెలిసింది. అయితే సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్‌ను దాటిన మొదటి తమిళ సినిమాగా 'లియో' కానుంది.
ప్రపంచవ్యాప్తంగా 'లియో' ఐదో రోజు రూ. 49.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఆరో రోజు రూ.51.4 కోట్లతో మొత్తంగా రూ. 506.4 కోట్లు కలెక్షన్లు వసూలు చేసిందని సమాచారం. ఇక ఆరో రోజు ఇండియాలో గ్రాస్ కలెక్షన్లు.. రూ. 37 కోట్లు వసూళ్లు అందుకున్నట్లు ట్రెడ్ వర్గాల టాక్. తమిళనాడులో రూ.21.50 కోట్లు, కేరళలో రూ. 5 కోట్లు, కర్ణాటకలో రూ. 3.50 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ. 3.50 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో సూమారు రూ. 3.50 కోట్లను వసూలు చేసిందని సమాచారం.
ఇకపోతే 'లియో' కలెక్షన్లు విషయంలో దూసుకెళ్తుంటే.. మరోవైపు ఇవి ఫేక్ వసూళ్లు అని లియోస్కామ్ పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది. ఈ విధంగా ఎవరు చేస్తున్నారే తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Tiger Nageswara Rao day 5 collections..మాస్ మహారాజ రవితేజ లీడ్ రోల్లో తెరకెక్కిన తాజా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం కూడా మంచి టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధిస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఐదో రోజుల్లో రూ. 20 కోట్ల మార్క్‌ను దాటేసింది. రెండు రోజులకే రూ. 10 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా.. ఐదు రోజుల్లో రూ. 23.84 కోట్లు అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగో రోజు కన్నా ఐదో రోజు ఈ మూవీ రెస్పాన్స్ పెరిగింది.
రోజువారి ఇండియా వైడ్ నెట్ కలెక్షన్లు చూస్తే..
మొదటి రోజు - రూ.6.55 కోట్లు