KGF 2 movie review: బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొని ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన చిత్రం 'కేజీఎఫ్'. కన్నడ రాకింగ్ స్టార్ యశ్- దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ 2' రూపొందింది. భారీ అంచనాల నడుమ నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా 10 వేలకుపైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టికెట్లు భారీ స్థాయిలో బుక్ అయ్యాయి. ఈ మూవీని చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు. బెనిఫిట్ షోలు చూసి వచ్చిన వారు.. సినిమా గూస్బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. గ్రాండ్ విజువల్స్‌తో పాటు రాఖీబాయ్‌గా యశ్- అధీరాగ సంజయ్ దత్ యాక్షన్స్ ఎపిసోడ్స్ వేరే లెవల్లో ఉన్నాయని చెబుతున్నారు. హీరోకు దీటుగా ప్రతినాయకుడి పాత్ర ఉందని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పూనకాలు తెప్పిస్తుందని పేర్కొంటున్నారు.
ప్రతి పదినిమిషాలకు కళ్లు చెదిరే యాక్షన్స్ సీక్వెన్స్ వస్తున్నాయని, సినిమాను వర్ణించడానికి మాటలు రావట్లేదని నెటిజన్లు చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని, ప్రతి సన్నివేశం మెస్మరైజ్ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. 'హీరో ఊర మాస్ విశ్వరూపం', 'హీరో ఎంట్రీ సీన్ ఊహించలేని స్థాయిలో ఉంది', 'ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది', 'చరిత్ర సృష్టించడం పక్కా', 'కేజీఎఫ్ 1కు మించి ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా బాక్సీఫీస్ బద్దలైపోవడం ఖాయమని.. 'కేజీఎఫ్ 3' కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
- ఫస్టాఫ్: హీరో ఇంట్రడక్షన్, సంజయ్ దత్ ఎంట్రీ సీన్, తుఫాన్ సాంగ్, ఇంటర్వెల్ సీన్ హైలైట్.
- సెకండాఫ్: మాస్ సీన్స్, చివరి వరకు ఎమోషన్స్‌ను బాగా క్యారీ చేయడం.. అమ్మ సెంటిమెంట్, క్లైమాక్స్ గూస్బంప్స్
- మొత్తంగా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్, 'కేజీఎఫ్ 3' వచ్చే అవకాశం.
అయితే కొంతమంది మాత్రం నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఫస్టాప్ పూనకాలు తెప్పించినా సెకండాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగిందని ట్వీట్లు చేస్తున్నారు.