తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అప్పుడు మా అమ్మకు 16 ఏళ్లు.. షూటింగ్ సమయంలో చిరు అలా చూసుకునేవారట' - కీర్తి సురేశ్​ భోళా శంకర్​ మూవీ

Keerthy Suresh Bhola Shankar Interview : స్టార్​ హీరోయిన్ కీర్తి సురేశ్​ ప్రస్తుతం వరసు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది తన ఖాతాలో రెండు సక్సెస్​ఫుల్​ సినిమాలను వేసుకున్న ఈ స్టార్​.. 'భోళా శంకర్​'తో ప్రేక్షకులను పలకరించేందుకు రానున్నారు. ఈ క్రమంలో విలేకరులతో ముచ్చటించిన కీర్తి సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు తన మాటల్లోనే..

Keerthy Suresh Bhola Shankar Interview
కీర్తి సురేశ్​ భోళా శంకర్ ఇంటర్వ్యూ

By

Published : Aug 6, 2023, 10:30 AM IST

Keerthy Suresh Bhola Shankar Interview : స్టార్ హీరోయిన్​ కీర్తి సురేశ్​కు ఈ ఏడాది బాగా కలసొచ్చిందనే చెప్పాలి. తను నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్ అందుకుని దూసుకెళ్లింది. మార్చిలో రిలీజైన 'దసరా'తో పాటు, జులైలో విడుదలైన 'నాయకుడు' సినిమాలతో తన ఖాతాల్లో వరుస విజయాలను తన ఖాతాలోకి వేసుకున్నారు.

ఇక ఇదే జోరును కొనసాగిస్తున్న కీర్తి.. మరికొద్ది రోజుల్లో చిరు చెల్లెలిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెహర్‌ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కీర్తి సురేశ్​ శనివారం విలేకరులతో ముచ్చటించి సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు తన మాటల్లోనే..

  • సూపర్​ స్టార్​ రజనీకాంత్‌తో 'అణ్ణాత్తే' సినిమా చేస్తున్న సమయంలోనే నాకు 'భోళా శంకర్'​లో పని చేసే అవకాశం వచ్చింది. ఇక చిరంజీవికి చెల్లిగా నటిస్తున్నాను అనగానే నాకు చాలా సంతోషమనిపించింది. అదే సమయంలో ఆయనతో నాకు డ్యాన్స్‌ చేసే అవకాశం ఉంటుందో లేదో అని కాస్త భయంగానూ అనిపించింది. కానీ, అదృష్టవశాత్తూ ఇందులో నేను ఆయనతో రెండు పాటలకు డ్యాన్స్‌ చేయగలిగాను. అన్నా చెల్లెలి అనుబంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిన సినిమా ఇది. యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని రకాల కమర్షియల్​ ఎలిమెంట్స్​ పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో చాలా మంది స్టార్లు కనిపిస్తారు. తమన్నా - చిరు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా వినోదాత్మకంగా ఉంటాయి. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి.
  • ఇక ఈ సినిమాలో నేను చిరంజీవి చెల్లిగా నటించినా సెట్లో ఆయన్ని ఎప్పుడూ చిరు గారు అనే పిలిచేదాన్ని. ఒక వేళ అన్నయ్య అంటే కొడతారేమో (నవ్వుతూ). మా అమ్మ చిరు సర్‌తో 'పున్నమినాగు' సినిమాలో కలిసి నటించారు. అప్పటికి తనకు 16ఏళ్లే. అయితే తనని ఆయన ఓ చిన్న పిల్లలా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారట. ప్రతి విషయాన్ని తనకి ఎంతో ఓపికగా నేర్పించేవారట. అమ్మ చెప్పిన ఈ విషయాలన్నీ ఓరోజు సెట్లో చిరంజీవితో చెప్పాను. ఆయన చాలా సంతోషపడ్డారు. మీ అమ్మ అమాయకురాలు కానీ, నువ్వు స్వీట్‌ నాటు అంటూ నవ్వేశారు. ఈ సినిమా షూటింగ్​ జరిగినన్ని రోజులు నాకు ఆయన ఇంటి నుంచే భోజనం తెప్పించేవారు. సెట్​లో ఎప్పుడూ ఆ భోజనం గురించే మాట్లాడుతూ ఉండేదాన్ని. ముఖ్యంగా ఆయన ఇంటి నుంచి వచ్చే ఉలవచారు నాకు చాలా బాగా నచ్చింది.
  • నాకు స్నేహితులు ఎక్కువమంది ఉన్నారు. నా ఎదుగుదలలో వారి ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. టైమ్​ దొరికినప్పుడల్లా వారితో గడిపేందుకు ఇష్టపడతాను. నాకు బ్రదర్‌ లాంటి ఫ్రెండ్స్‌ కూడా చాలా మంది ఉన్నారు. 'భోళా శంకర్‌' వల్ల చిరంజీవితో మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఆయన మా అమ్మకు మంచి స్నేహితుడే. కానీ, ఇప్పుడు ఆయనకు నేను కొత్త ఫ్రెండ్‌. ఫ్రెండ్​షిప్​ డే అనేది ప్రత్యేకంగా జరుపుకోవడం అన్నది నాకు తెలియదు. ఎందుకంటే ఏడాది మొత్తం మేము వేడుక చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి నా వరకు ప్రతిరోజూ ఫ్రెండ్‌షిప్‌ డేనే.
  • హీరోయిన్​ ఓరియెంటడ్​.. కమర్షియల్‌ సినిమాలను బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్లడం అనేది తేలికగ్గానే అనిపించొచ్చు కానీ, అది చాలా కష్టంగానే ఉంది. కాకపోతే నాకు అన్ని రకాల సినిమాలను చేయాలని ఉంది. ఓ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా విషయం చేయలేకపోయాను అని నేను బాధపడకూడదు. అదే నా ఆలోచన. భవిష్యత్తులో నాకు మరిన్ని ఎక్స్​పెరిమెంటల్​ పాత్రలు.. జానర్లు చేయాలని ఉంది. ప్రస్తుతం నేను 'రివాల్వర్‌ రీటా', 'కన్నివేడి', 'రఘు తాత' తదితర చిత్రాల్లో నటిస్తున్నా. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details