Kantara Chapter 1 Teaser :రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కాంతార చాప్టర్ -1'. ఇది గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. 'కాంతార' తొలి పార్ట్ సినిమాలో చూసిన కథకు ముందు ఏం జరిగింది? అనేది ఈ 'కాంతార చాప్టర్ 1'లో చూపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇక ముందుగా ప్రకటించిన విధంగానే.. సోమవారం (నవంబర్ 27)న సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మరి మీరు ఈ టీజర్ చూశారా?
అయితే కాంతార తొలి భాగాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. స్టోరీ అంతా అటవీ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తీయడం వల్ల పెద్దగా ఖర్చు కాలేదు. కానీ, కాంతార ప్రీక్వెల్ మాత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ 4వ సెంచరీలోదని, హీరో రిషభ్ శెట్టి కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. ఇక మూవీకి హైప్ క్రియేట్ అయ్యేలా.. విఎఫ్ఎక్స్కు డిజైన్స్ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారట. అందుకనే బడ్జెట్ రేంజ్ పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్‌ను నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. మొదటి పార్ట్ షూటింగ్‌ను ఎక్కువ శాతం ఆయన సొంత ఊరు కుందాపురలో చేయగా.. ఇప్పుడు రెండో భాగాన్ని బెంగుళూర్లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఇటీవల ప్రారంభమైన సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో ముగించేలా ప్లాన్ చేశారట. ఇక 2024 చివర్లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేయనున్నారట.