తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జియా ఖాన్​ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు.. నిర్దోషిగా సూరజ్ పంచోలీ

నటి జియా ఖాన్​ ఆత్మహత్య కేసులో ముంబయి సీబీఐ స్పెషల్​ కోర్టు తీర్పు వెల్లడించింది. నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా తేల్చింది.

Jiah Khan suicide case
Jiah Khan suicide case

By

Published : Apr 28, 2023, 12:36 PM IST

Updated : Apr 28, 2023, 2:19 PM IST

సుమారు పదేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత బాలీవుడ్​ నటి జియా ఖాన్​ సూసైడ్​ కేసులో ముంబయి సీబీఐ స్పెషల్​ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్​.. ఆత్మహత్యకు ప్రేరేపించాడనేందుకు ఆధారాలు లేవని సీబీఐ కోర్టు జడ్జి ఎఎస్ సయ్యద్ తీర్పును శుక్రవారం మధ్యాహ్నం వెలువరించారు. నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వులపై అప్పీల్‌ను సిద్ధం చేసుకోవచ్చని ఆయన.. జియా ఖాన్​ తల్లి రబియా ఖాన్‌కు చెప్పారు.

జియా ఖాన్​ కేసులో తన న్యాయ పోరాటం కొనసాగుతుందని ఆమె తల్లి రబియా ఖాన్.. కోర్టు ప్రాంగణంలో విలేకరులతో చెప్పారు. "నేను న్యాయం జరిగే వరకు పోరాడతాను. ఈ తీర్పులో ఆశ్చర్యం లేదు.. నేను దీనిని ముందే ఊహించాను. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు కాదు.. హత్య కేసు" అని ఆమె ఆరోపించారు.

జియా ఖాన్​ కేసు టైమ్​లైన్​ను పరిశీలిస్తే..

  • 2013 జూన్ 3: ముంబయిలోని జుహు అపార్ట్‌మెంట్‌లో జియా ఖాన్ విగతజీవిగా కనిపించింది. అప్పటికి ఆమె వయస్సు 25 సంవత్సరాలు.
  • 2013 జూన్ 4: పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి.. జియా మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.
  • 2013 జూన్ 5: జియా అంత్యక్రియలు ముంబయిలో జరిగాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతోపాటు చిత్ర పరిశ్రమకు చెందిన ఆమె సహచరులు హాజరయ్యారు.
  • 2013 జూన్ 7: జియాను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.
  • 2013 జూన్ 10: సూరజ్ పంచోలీకి ముంబయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
  • 2013 జులై 2: జియా తల్లి రబియా ఖాన్, తన కుమార్తె మరణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
  • 2013 జులై 3: ముంబయి పోలీసులు సూరజ్ పంచోలీపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.
  • 2014 జులై 16: జియా ఖాన్ కేసులో ముంబయి కోర్టులో విచారణ ప్రారంభమైంది.
  • 2015 జనవరి: బాంబే హైకోర్టు సూరజ్ పంచోలీకి రెండోసారి బెయిల్ మంజూరు చేసింది.
  • 2017 అక్టోబర్​ 7: సూరజ్ పంచోలీపై ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై ముంబయి కోర్టు అభియోగాలు మోపింది.
  • 2017 డిసెంబర్ : జియా మరణంపై రబియా ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
  • 2018 మార్చి: జియా ఆత్మహత్యకు సూరజ్ పంచోలీ ప్రేరిపంచాడని ఆరోపిస్తూ సీబీఐ ఈ కేసులో ఛార్జ్​షీట్ దాఖలు చేసింది.
  • 2019 మార్చి: సూరజ్ పంచోలీపై సీబీఐ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసిన తర్వాత.. జియా ఖాన్ కేసులో విచారణ మళ్లీ ప్రారంభమైంది.
  • 2019 జూన్: కేసులో అదనపు సాక్ష్యాలను సమర్పించేందుకు రబియా ఖాన్‌కు కోర్టు అనుమతి మంజూరు చేసింది.
  • 2021 ఫిబ్రవరి: కేసులో సాక్ష్యాలపై కొత్త ఫోరెన్సిక్ విశ్లేషణను కోరుతూ రబియా ఖాన్ దరఖాస్తును దాఖలు చేసిన తర్వాత.. తదుపరి నోటీసు వచ్చేవరకు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
  • 2022 సెప్టెంబరు: తన కుమార్తె జియా ఖాన్ ఆత్మహత్య కేసుపై తాజా దర్యాప్తును కోరుతూ రబియా ఖాన్ చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.
  • 2023 ఏప్రిల్ 28: జియా ఖాన్ ఆత్మహత్య కేసులో ముంబయి సీబీఐ కోర్టు తీర్పును వెల్లడించింది.
Last Updated : Apr 28, 2023, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details