Jailer OTT Release Date : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన 'జైలర్' చిత్రం రీసెంట్గా విడుదలై పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమాను ఓవర్సీస్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా చూసేందుకు అన్ని భాషల సినీ ప్రేక్షకులకు థియేటర్లకు క్యూ కట్టారు. దాదాపు 25రోజుల పాటు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. మొత్తంగా ఇప్పుటివరకు ఈ చిత్రం దాదాపు రూ. 650 కోట్ల వసూళ్లను సాధించింది(Jailer Collections).
ఇక ఈ చిత్రంలో రజనీ సరనస నటించిన అలనాటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఎమోషనల్ అండ్ లైట్ కామెడీ యాక్టింగ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ ఎక్స్‌ప్లోజివ్ యాక్టింగ్ హైలైట్‌గా నిలిచింది. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరూధ్ అందించిన సంగీతం రజనీ పాత్రను ఎలివేట్ చేస్తూ గూస్ బంప్స్ తెప్పించింది.
ఈ సినిమాను దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం భారీ లాభాలు తీసుకురావడంతో .. చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్ బ్యానర్ అధినేత కళానిధి మారన్.. రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ కుమార్, అనిరూధ్‌కు స్పెషల్ కాస్ట్లీ కార్లు, చెక్‌లను బహుమతిగా ఇచ్చారు.