'జబర్దస్త్' కమెడియన్ 'పంచ్' ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ మరో కమెడియన్ నూకరాజు స్పెషల్ వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం ఎలా ఉంది? వైద్యులు ఏమన్నారు? వంటి విషయాలను ఇందులో తెలిపాడు.
పంచ్ ప్రసాద్ కాస్త కోలుకున్నాడని.. ఓ మనిషి సాయం.. లేదా కర్ర సాయంతో మెల్లగా నడుస్తున్నాడని చూపించాడు. గత నాలుగు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతుందని.. అప్పటి నుంచి అతడికి రోజంత సెలైన్స్ పెడుతున్నారని .. ప్రత్యేకంగా ఓ నర్స్ కూడా ఇంట్లోనే ఉండి 24 గంటలు చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. మరో నాలుగు రోజులు ఇలాగే చికిత్స తీసుకోవాలని.. సెలైన్స్ ద్వారా పంచ్ ప్రసాద్‌కు యాంటి బయోటిక్స్ ఇస్తున్నారని పేర్కొన్నాడు.