తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వెంకీ 'సైంధవ్' నుంచి నవాజుద్దీన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. లగ్జరీ కారుపై కూర్చుని బీడీ తాగుతూ! - సుడిగాలి సుధీర్​ గాలోడు

శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​ నటిస్తున్న 'సైంధవ్' సినిమా నుంచి కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఫస్ట్ లుక్​ను మేకర్స్​ విడుదల చేశారు.

saindhav nawazuddin first look
saindhav nawazuddin first look

By

Published : May 19, 2023, 10:37 PM IST

Saindhav Nawazuddin First Look : టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్​ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిట్ 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న శైలేష్ కొలను విక్టరీ వెంకటేశ్​తో సినిమా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. దీంతో ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇటీవలే టీజర్ గ్లిమ్స్ వీడియోతో చెప్పకనే చెప్పారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో వెంకటేశ్​ను ఇప్పటివరకు మునుపెన్నడూ చూడని పాత్రలో డైరెక్టర్ శైలేష్ చూపించబోతున్నారు.

'సైంధవ్' నవాజుద్దీన్ ఫస్ట్ లుక్

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం.. ఆయన పుట్టినరోజు సందర్భంగా తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో నమాజుద్దీన్ 'వికాస్ మాలిక్' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్​లో నమాజుద్దీన్ లగ్జరీ కారుపై కూర్చుని, బీడీ తాగుతూ కనిపించారు. వెంకటేశ్​ కెరీర్​లోనే 75వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తుండగా.. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణ్​ సంగీతం అందిస్తున్నారు. వెంకటేశ్​ సరసన శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

సుధీర్​ మూవీకి ఇంట్రెస్టింగ్​ టైటిల్​
Sudheer Movie Title : జబర్దస్త్ కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగిన సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం ఆచితూచి అడుగులు ముం:దుకు వేస్తున్నారు. గాలోడు సినిమాతో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఇటీవల తన నాలుగో సినిమాను మొదలుపెట్టారు. ఇండస్ట్రీలోని బడా నిర్మాతల సమక్షంలో సుడిగాలి సుధీర్ సినిమా ఘనంగా ప్రారంభమైంది. పాగల్ ఫేమ్ నరేశ్​ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్లపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. సుడిగాలి సుధీర్ సరసన దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమెకు ఇదే తొలి తెలుగు సినిమా. శుక్రవారం సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. GOAT - గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనే ఆసక్తిక టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టారు.

సుధీర్​ మూవీకి ఇంట్రెస్టింగ్​ టైటిల్​

సిద్ధార్థ్ టక్కర్​ రిలీజ్ డేట్​ ఫిక్స్​
Siddharth Takkar Movie Release Date :నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్థ్.. త్వరలో టక్కర్ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్

ABOUT THE AUTHOR

...view details