India's Richest Actress :సినిమా హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు పేరుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తుంటారు. సినిమాల ద్వారానే కాకుండా వారికున్న క్రేజ్‌తో ఎండార్స్మెంట్, యాడ్స్ చేస్తూ సంపద పెంచుకుంటున్నారు. అయితే క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లు సైతం హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోనే రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరై ఉంటారని ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఆ నటి ఎవరో తెలుసుకుందామా?
ప్రియాంక చోప్రా జోనాస్ బాలీవుడ్‌లో రెండో అత్యంత సంపన్న నటిగా నిలిచింది. సినిమాలు, ప్రకటనలతోపాటు ఆమెకు అనోమలీ, అనే బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీ, పర్ఫెక్ట్ మూమెంట్ అనే గార్మెంట్ కంపెనీ ఉన్నాయి. వీటితోపాటు న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్ కూడా ఆమె బిజినెస్‌లో భాగమే. ఇవే కాకుండా పర్పుల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ కూడా డబ్బు సంపాదిస్తుంది. ఇక ప్రియాంక అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ప్రియాంక నెట్‌వర్త్ దాదాపు రూ.600 కోట్లు.
ఒక సినిమాకు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్లు వసూలు చేసే ఆలియా భట్ నెట్‌వర్త్ పరంగా బాలీవుడ్‌లో మూడో సంపన్న నటిగా ఉంది. ఆమె ఇటీవలె ఎడ్-ఎ-మమ్మా అనే బ్రాండ్ గార్మెంట్స్ ప్రారంభించింది. దీని టర్నోవర్ ఏడాదికి రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే కాకుండా ఎటర్నల్ సన్‌షైన్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. డ్యూరోఫ్లెక్స్, అవార్, క్యాడ్‌బరీ, క్వాలిటీ వాల్స్, కార్నెట్టో, ఫ్రూటీ వంటి కంపెనీల బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది ఆలియా. దీంతో ఆమె ప్రస్తుత నెట్‌వర్త్ రూ.550 కోట్లుగా ఉంది.
దీపికా పదుకొనె ఒక్కో సినిమాకి రూ. 25 నుంచి రూ. 30 కోట్లు వరకు తీసుకుంటుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం ప్రకటనల నుంచే వస్తుంది. ఆమె ఏషియన్ పెయింట్స్, లాయిడ్, జాగ్వార్, జియో, లోరియల్, తనిష్క్, కోకా-కోలా లాంటి పెద్ద పెద్ద కంపెనీల ప్రకటనల్లో నటిస్తుంది. దీంతో పాటు ఆమె 82E అనే బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీకి యజమాని కూడా. దీపికా మొత్తం నికర విలువ దాదాపు రూ. 500 కోట్లు. బాలీవుడ్‌లోని అత్యంత ధనిక నటీమణుల జాబితాలో దీపికా నాలుగో స్థానంలో ఉంది. ఇక రూ.485 కోట్ల నికర విలువతో సీనియర్ నటి కరీనా కపూర్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. కరీనా ఒక సినిమాకు రూ. 10 కోట్లు, ఒక ప్రకటనకు రూ. 6 కోట్లు దాకా ఛార్జ్ చేస్తుంది. స్టేజ్ షోలు, రేడియో షోల ద్వారా సైతం ఆమె డబ్బు సంపాదిస్తుంది.