Indian 2 Movie Shooting :ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'భారతీయుడు- 2' షూటింగ్ ఎట్టకేలకు ముగిసింది. 90ల్లో వచ్చిన 'భారతీయుడు -1'కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. చెన్నైలో జరిగిన చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ షేర్ చేసింది. ఈ ఫొటోలో హీరో కమల్‌హాసన్‌తోపాటు సినిమాకు పనిచేసిన టెక్నిషియన్లు ఉన్నారు. అయితే కమల్‌హాసన్, శంకర్ కెరీర్లో ఎక్కువ కాలం షూటింగ్ జరిగిన సినిమా భారతీయుడు- 2 నిలిచింది.
దర్శకుడు శంకర్ ఈ ప్రాజెక్టును 2015లో ప్రకటించారు. ప్రీ పొడక్షన్ పూర్తైన తర్వార 2018లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. అయితే వివిధ కారణాల వల్ల 2020లో భారతతీయుడు- 2 చిత్రీకరణ ఆగిపోయింది. ఈ క్రమంలో కమల్‌హాసన్ రంగంలో దిగి మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యేలా చేశారు. అలా 2022లో చిత్రీకరణ ప్రారంభం అయింది. గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమాకు వర్క్ చేస్తూనే, భారతీయుడు-2ను కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది.