తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హిట్​ 2' రిలీజ్​ డేట్​.. 'ఎఫ్​ 3' ట్రైలర్​ అప్డేట్​.. సోనూ @12మిలియన్స్​ - ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ డేట్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో అడివిశేష్​ హిట్​ 2, వెంకటేశ్​, వరుణ్​ 'ఎఫ్​ 3', సోనూసూద్​ చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు...

hit 2 movie release date
'హిట్​ 2' రిలీజ్​ డేట్

By

Published : May 2, 2022, 11:29 AM IST

Hit 2 movie release date: 'గూఢచారి', 'ఎవరు' వంటి సస్పెన్స్‌ థ్రిల్లర్లతో ప్రేక్షకుల్ని అలరించిన యువ హీరో అడివి శేష్‌ ప్రస్తుతం 'మేజర్'​ మూవీ రిలీజ్​ పనుల్లో బిజీగా ఉన్నారు. శశికిరణ్‌ తిక్క తెరకెక్కించిన ఈ మూవీ జూన్​ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఆయన నుంచి మరో కొత్త అప్డేట్​ వచ్చింది. విజయవంతమైన విశ్వక్​సేన్​ 'హిట్‌'కి కొనసాగింపుగా 'హిట్‌2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అడవి శేష్‌ ప్రధాన పాత్రలో.. కేడీ అనే పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. 'మేజర్'​ రిలీజ్​ అయిన తర్వాత నెలలోనే జులై 29న థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఓ కొత్త పోస్టర్​ను కూడా విడుదల చేసింది. దీనికి తొలి చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. కథానాయకులు నాని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శేష్​కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్​, పోస్టర్​ అభిమానులను ఆకట్టుకున్నాయి.

'హిట్​ 2' రిలీజ్​ డేట్

F3 movie trailer release date: 'ఎఫ్ 3' చిత్రం నుండి క్రేజీ అప్డేట్​ వ‌చ్చింది. ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ప్రకటించింది మూవీయూనిట్. మే 9న రిలీజ్ చేస్తామని చెప్పింది.గతంలో వచ్చి సూపర్ హిట్​గా నిలిచిన 'ఎఫ్2'కి సీక్వెల్​గా ఈ చిత్రం రూపొందింది. మొదటి పార్ట్​లో ఫ్యామిలీతో కలిగే ఫ్రస్టేషన్​ను చూపించగా ఈ సారి మనీతో మనుషులకు కలిగే ఫ్రస్టేషన్​ను 'ఎఫ్ 3' ద్వారా చూపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యి రిలీజ్​కు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై ఆసక్తి పెంచాయి. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూజాహెగ్డే స్పెషల్​ సాంగ్​లో చిందులేసింది. ఫన్ డైరెక్టర్​ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు.

Sonusood twitter followers: తన అద్భుతమైన నటనతో పాటు కొవిడ్‌ సమయంలో విశేష సేవాకార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందిన నటుడు సోనూసూద్​. సమాజంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సాధించారు. సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​లో​ ఓ మార్క్​ను అందుకున్నారు. ట్విట్టర్​లో 12 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నారు. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్​మీడియాలో ఆయన్ను ట్రెండ్​ చేస్తున్నారు. ఇక టాలీవుడ్​లో ట్విట్టర్​ ఫాలోవర్స్​ విషయానికొస్తే.. అత్యధికంగా సూపర్​స్టార్​ మహేశ్​బాబును 12.5మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. మిగతా స్టార్ హీరోలందరికీ 5మిలియన్ల కన్నా తక్కవ మందే ఉన్నారు. కాగా, సోనూ.. ఇటీవలే 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటూ.. మరోవైపు సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

సోనూ @12మిలియన్స్​

ఇదీ చూడండి: భారీ క్రికెట్​ స్టేడియం నిర్మించనున్న షారుక్​ ఖాన్​!

ABOUT THE AUTHOR

...view details