వరుస యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్లో మాస్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశాల్. జయపజాలతో సంబంధం లేకుండా చిత్రాలను చేస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. అయితే తాజాగా ఆయన గురించి ప్రముఖ రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.
"అందరూ విశాల్ గురించి గొప్పగా మాట్లాడారు. నేను సరదాగా తనకు ఉన్న ఓ చెడ్డ లక్షణం గురించి చెబుతాను. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా, షూటింగ్ ఎన్ని రోజులైనా విశాల్ చేస్తూనే ఉంటాడు. ఈ లక్షణం ఒక జబ్బుతో సమానం. ఇది మా అబ్బాయి రాజమౌళి నుంచి విశాల్‌కు అంటుకుంది. రాజమౌళి ఎలా అయితే విజయాన్ని అందుకున్నాడో.. విశాల్ కూడా అలానే సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. నేను ఇలాంటి ఈవెంట్స్‌కు చాలా తక్కువగా హాజరవుతాను. ఇటీవల 'కార్తికేయ2' ఈవెంట్‌కు వెళ్లాను. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ 'లాఠీ' సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నాను" అంటూ చిత్రబృందానికి విజయేంద్ర ప్రసాద్ అభినందనలు తెలిపారు.
ఇక విశాల్ మాట్లాడుతూ తన కటౌట్‌లను ఏర్పాటుచేసి, తనకు బొకేలు లాంటివి ఇవ్వద్దన్నారు. ఆ డబ్బులతో చిన్నపిల్లలకు సహాయం చేయాలని తన ఫ్యాన్స్‌ను మరోసారి కోరారు. "నేను జీవితంలో చాలా కిందస్థాయిలో ఉండే కష్టాలను చూశాను. అలాగే గొప్ప వాళ్లు పొందే ఆనందాన్నీ చూశాను. స్కూల్, కాలేజీల్లో చెప్పే పాఠాల కంటే సినిమా నేర్పించే పాఠాలు చాలా గొప్పవి. నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది. నా దగ్గరకు వచ్చి ఎవరైనా కథ రికమెండ్ చేస్తే.. అది బాగుంటే వెంటనే వాళ్లని కౌగిలించుకుంటాను. నచ్చకపోతే లోపలికి పిలిచి తలుపులు వేసి మరీ వాళ్లని కొడతాను. కానీ 'లాఠీ' కథ నాకు చాలా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాను ఎంత మంది చూస్తారో ఆ డబ్బుల్లో.. ఒక టికెట్‌కు ఓ రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను" అంటూ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ సినిమా చూడాలని విశాల్ కోరారు. ఇక విజయేంద్రప్రసాద్ గారిని కలవాలన్నది తన కోరిక అని.. ఆయన ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఇదీ చదవండి:'పవన్‌కల్యాణ్ ఆ సినిమాలో నటిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది..?'
'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఆనందాన్ని ఆపుకోలేక లీక్ చేసిన DSP!