తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హరిహర వీరమల్లు'​ అప్డేట్.. ఆ పాత్రే తన డ్రీమ్​రోల్​ అంటున్న కృతి! - కృతి శెట్టి

పవన్​ కల్యాణ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' నుంచి క్రేజీ అప్డేట్​ ఇచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. సినిమా కోసం ఓ ప్రేమ గీతం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, తనకు రాకుమారి పాత్ర చేయాలని ఉందని ఉప్పెన భామ కృతి తెలిపింది.

pavan kalyan krithi setty
pavan kalyan krithi setty

By

Published : Apr 30, 2022, 9:43 PM IST

Hari Hara Veera Mallu Latest Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్‌ప్రైజింగ్ అప్డేట్​ ఇచ్చారు చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్‌తో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై అగ్ర నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, ప్రస్తుతం ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన ప్రేమ గీతాన్ని రాస్తున్నట్టు తెలిపారు కీరవాణి. దీని కోసం ఆయన చాలా శ్రమిస్తున్నారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు కీరవాణి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Krithi Setty About Her Dream Role: 'ఉప్పెన' సినిమాతో తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది హీరోయిన్​ కృతిశెట్టి. యూత్​లో ఫుల్​ క్రేజ్​ను కూడా దక్కించుకుంది. ఆ తర్వాత 'శ్యామ్‌ సింగరాయ్‌', బంగార్రాజు' వంటి చిత్రాలతో మరో రెండు విజయాల్ని ఖాతాలో వేసుకుని మరింత పాపులారిటినీ దక్కించుకుంది.

కృతిశెట్టి

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన డ్రీమ్​ రోల్​ గురించి తెలిపింది. "నాకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేదు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ భిన్నమైనవి. అందుకే ఇంత త్వరగా ప్రేక్షకుల ప్రేమను పొందగలిగాను. నటినా నన్ను నేను నిరూపించుకోవడానికి.. సవాలు విసిరే పాత్రలను ఎంచుకోవాలి. అలాంటి రోల్స్​ కోసమే ఎదురుచూస్తున్నా. రాకుమారి పాత్రలో నటించాలనేది నా కల. ఎప్పటికీ తీరుతుందో చూడాలి" అని పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం', 'ది వారియర్​'​ సహా తమిళ హీరో సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది.

ఇదీ చదవండి:ప్రేమకు దూరంగా ఉండాలనుకుంటున్నా: సమంత

ABOUT THE AUTHOR

...view details