Happy Birthday Nagarjuna : అక్కినేని హీరో నాగార్జున తన కొత్త సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా 'నా సామిరంగ'(Nagarjuna new movie updates) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్‌ఫుల్‌గా ఉంది. నాగార్జున స్టైల్‌గా బీడీ కాల్చుకోవడం, లుంగీ మాస్ లుక్ అదిరింది. 'జాతర జాతర' అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. 'ఈ సారి పండక్కి నా సామిరంగ.. కింగ్ మాస్ జాతర మొదలు..' అంటూ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీగా దిగబోతున్నట్లు తెలిపారు.
Nagarjuna Latest Movie : ఇక ఈ గ్లింప్స్‌లో నాగార్జున కట్టూ, మాట తీరు మంచి మాస్ అండ్ స్టైలిష్‌గా అనిపించింది. నాగార్జున బీడీ కాల్చుకుని నడిచే విధానం, అందులోనూ లుంగీ వేసుకుని మాస్ లుక్‌లో కనిపించడం అదిరిపోయింది. ప్రచార చిత్రం చివర్లో.. 'ఈ సారి పండక్కి నా సామిరంగ'.. అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ సూపర్‌గా ఉంది. ఈ టైటిల్ గ్లింప్స్.. అక్కినేని అభిమానులకు ఓ సూపర్ ఫీస్ట్‌లా ఉంది.
"అన్నా లోపల 56 మంది రౌడీలను పోగేశా'.. 'ఈ పండక్కి పనైపోవాలి'.. 'వాళ్లు మామూలోళ్లు కాదన్నా.. పులులు'.. 'అన్నా ఆడి చెయ్యి తీసేయాలా? కాలు తీసేయాలా? ఏకంగా తల తీసేయమంటావా? ఎవడన్నా ఆడు'.. అంటూ రౌడీలంతా కలిసి డైలాగులు చెబుతుంటే... అప్పుడు కింగ్ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలివేషన్ ఇస్తూ.. అదే రౌడీల గుంపులో ఉన్న నాగ్‌ను చూపించారు. తన తలపైన ఉన్న ముగుసు తీసి రగ్డ్ గడ్డంతో గట్టిగా నవ్వుతూ నాగ్ కనిపించి అదరగొట్టేశారు.