టీవీ సీరియళ్లలో బాలనటిగా ప్రయాణం మొదటి పెట్టి.. హీరోయిన్గా దూసుకుపోతోంది హన్సిక మోత్వానీ. ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత కొంత కాలంగా హన్సిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమేని.. ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్లో జైపూర్ కోటలో వివాహం చేసుకుంటున్నట్లు తెలిపింది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయినట్లు వెల్లడించింది. అయితే, పెళ్లి కొడుకు ఎవరనేది బయటకు వెల్లడించలేదు.
హన్సిక వివాహానికి రాజస్థాన్ జైపూర్‌లోని 450 ఏళ్ల చరిత్ర కలిగిన 'ముందోతా ఫోర్ట్ ప్యాలెస్' వేదిక కానుంది. రాయల్ వెడ్డింగ్లా ఈ పెళ్లి జరగనుంది. కొంచెం వింటేజ్ టచ్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం. దీనికోసం ఈ హోటల్‌లోని అన్ని గదులు, సూట్లను ఇప్పటికే బుక్ చేసినట్టు సమాచారం.