తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTT లవర్స్​కు​ సరికొత్తగా ETV WIN.. 'ఒక్క రూపాయి'కే బ్లాక్ బాస్టర్​ సినిమాలు, సిరీస్​లు - ఈటీవీ విన్ ఓటీటీ యాప్​

చరిత్రలో నిలిచిపోయే అపురూపమైన చిత్రాలు, ఉత్కంఠను రేపే ఒరిజినల్‌ సినిమాలు,ఆద్యంతం ఉత్సాహంగా కలిగించే రియాల్టీ షోలు, డైలీ సీరియళ్లు.. ఇవన్నీ ఒకే వేదికపై అందిస్తోంది ఈటీవీ. ఇప్పటివరకూ టీవీలకే పరిమితమైన వినోదాన్ని.. మొబైల్‌కు విస్తరిస్తూఈటీవి విన్‌ యాప్‌ ద్వారా ఓటీటీని.. నేటి నుంచే సరికొత్తగా అందిస్తోంది. ఈటీవీకి చెందిన అన్ని ఛానళ్లు, ప్రత్యేకంగా రూపొందించిన చిత్రాలు, షోలు.. రోజుకు కేవలం ఒక్క రూపాయికే మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగాఉన్నాయి. మరి ఇకెందుకు ఆలస్యం, మీ మొబైల్‌లో ఈటీవీ విన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. వినోద ప్రపంచంలో విహరించండి.

ETV WIN
ETV WIN

By

Published : Mar 22, 2023, 6:19 AM IST

Updated : Mar 22, 2023, 7:03 AM IST

ఓటీటీ ప్రపంచంలో మరో కొత్త అధ్యాయానికి.. ఈటీవీ శ్రీకారం చుట్టింది. ఈటీవీకి చెందిన అన్ని ఛానళ్లను, అలనాటి మేటి చిత్రాల నుంచి సరికొత్త కంటెంట్​ ఉన్న సినిమాలు, రియాల్టీ షోలను ఒకే చోటకు చేర్చి.. డిజిటల్​ ప్లాట్​ఫామ్​ ఈటీవీ విన్‌ యాప్‌ ద్వారా నేటి నుంచి అందిస్తోంది. ఇప్పటివరకూ కేవలం టీవీలకే పరిమితమైన వినోదభరిత కార్యక్రమాలను ఇక మీ మొబైల్‌లోఎప్పుడైనా, ఎక్కడైనా ఈటీవీ విన్‌ ఓటీటీ వేదిక ద్వారా వీక్షించే అవకాశం.. నేటి నుంచే అందుబాటులోకి వచ్చింది. ఇటు టీవీలతో పాటు మొబైల్ ఫోన్‌లోనూ వీక్షకులను మురిపించేందుకు 'ఈటీవీ విన్' అన్ని హంగులతో సిద్ధమైంది.

డిజిటల్ ప్రపంచంలో ఈటీవీ విన్ ఓటీటీ... సరికొత్త వినోదాన్ని అందించనుంది. తెలుగులో విడుదలైన సరికొత్త చిత్రాలను... 'వరల్డ్ డిజిటల్ ప్రీమియర్'గా అందిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మానందం సరికొత్త పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించిన 'పంచతంత్రం' చిత్రం నేటి నుంచే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ప్రేక్షకుల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఒక ఒరిజనల్ మూవీ.. ప్రతి నెలా వినోదాన్ని పంచనుంది. సినిమా థియేటర్లలోకానీ, టీవీల్లో కానీ విడుదలకాని.... ఈ సరికొత్త సినిమాలు కేవలం ఈటీవీ విన్‌ ప్రేక్షకులకే మాత్రమే ప్రత్యేకం.సంచలన దర్శకుడు రవిబాబు పర్యవేక్షణలో రూపొందించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'అసలు' చిత్రం ఏప్రిల్ 5 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

OTT లవర్స్​కు​ సరికొత్తగా ETV WIN.. 'ఒక్క రూపాయి'కే బ్లాక్ బాస్టర్​ సినిమాలు, సిరీస్​లు

విన్ ఓటీటీ వేదిక కోసమే రూపొందించిన వెబ్ సిరీస్ మరో ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి పర్యవేక్షణలో 'రైటో లెప్టో' సిరీస్ నేటి రోజు నుంచే ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తెలుగు చలన చిత్ర అతిరధ మహారధులు నిర్మించిన, నటించిన.. 500కు పైగా అపురూపమైన చిత్రాలు ఎప్పుడుకావాలంటే అప్పుడు వీక్షించి..ఆనందించే అవకాశం ఇకపై.. ఈటీవీ విన్ ప్రేక్షకుల సొంతం. ఈటీవీ సీరియల్స్, రియాల్టీ షోలు..టీవీలో కంటే ముందే ఈటీవీ-విన్‌లో ఏ రోజుకారోజు ఉదయం 6 గంటల నుంచే అందుబాటులో ఉంటాయి.

OTT లవర్స్​కు​ సరికొత్తగా ETV WIN.. 'ఒక్క రూపాయి'కే బ్లాక్ బాస్టర్​ సినిమాలు, సిరీస్​లు..

40వేల గంటలకుపైగా ఉన్న ఈటీవీ కార్యక్రమాల భాండాగారంలో ఏదైనా.. ఈటీవీ విన్‌ ఓటీటీ వేదిక ద్వారా కేవలం రోజుకి ఒక్క రూపాయి ఖర్చుతో చూడవచ్చు. సంవత్సరానికి 365 రూపాయలు కనీస మొత్తం చెల్లించి.. ఈటీవీ విన్‌ మొబైల్ యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మొబైల్‌తో పాటు టీవీలోనూ చూడాలనుకుంటే ప్రీమియం ప్లాన్‌లో ఏడాదికి కేవలం 499 రూపాయలు చెల్లిస్తే చాలు.. అనంతమైన వినోదం మీ సొంతం.

ఇదీ చూడండి:పాపులర్ లిస్ట్​లో రామ్​చరణ్ టాప్ ప్లేస్.. పడిపోయిన కోహ్లీ బ్రాండ్ వాల్యూ

Last Updated : Mar 22, 2023, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details