ఇండస్ట్రీలో చాలా సినిమాలు సెట్స్‌పైకి వెళ్లి ఆగిపోతుండటం చూస్తూనే ఉండటం. వాటిలో కొన్ని కొన్నాళ్ల తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వచ్చి రిలీజ్‌కు సిద్ధమవుతుంటాయి. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మేనన్ దర్శకత్వంలో ధృవనక్షత్రం. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను 2017లో ప్రకటించారు. దీనికి హరీశ్ జయ రాజ్ సంగీత దర్శకుడు. ఈ ముగ్గురు కాంబో అనగానే అప్పట్లో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. విక్రమ్ క్రేజ్‌తో పాటు మరోవైపు గౌతమ్ మేనన్-హరీశ్ జయరాజ్ కాంబో సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చెలి, ఘర్షణ వంటి పలు సినిమాలు కూడా మ్యూజిక్ పరంగా సెన్షేషనల్ హిట్ అయ్యాయి. దీంతో ధృవనక్షత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది.
ఆగిపోయిన హిట్ కాంబో మూవీ.. 5 ఏళ్ల తర్వాత రిలీజ్‌కు రెడీ! - హరీశ్ జయరాజ్ గౌతమ్ మేనన్ సినిమా
గౌతమ్ మేనన్- చియాన్ విక్రమ్-హరీశ్ జయరాజ్ కాంబోలో తెరకెక్కుతూ ఆగిపోయిన ధృవ నక్షత్రం సినిమా మళ్లీ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. 2017లో అనౌన్స్ చేసిన ఈ చిత్రాన్ని ఈ వేసవికి విడుదుల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాలు..
ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడ కూడా ఊసే వినిపించలేదు. అంతే కాకుండా గౌతమ్, విక్రమ్, హరీశ్.. ముగ్గురూ వేర్వేరుగా పలు ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. ఇక ఈ సినిమా పట్టాలెక్కదు అని ఫిక్స్ అయిపోయి మర్చిపోయిన సందర్భంలో తాజాగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూట్‌ను త్వరలోనే కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను టీమ్ ఏకకాలంలో పూర్తి చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
ఇక స్పై థ్రిల్లర్‌గా రూపొంతున్న ఈ సినిమా కథేంటంటే.. జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. చియాన్ విక్రమ్ టీమ్‌కు హెడ్‌గా కనిపించగా.. ప్రముఖ నటులు రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, ఆర్ పార్తిబన్, దివ్యదర్శిని, మున్నా, వంశీకృష్ణ తదితరులు ఇతర పాత్రలో నటించారు.