ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు తుది నివాళులు అర్పించేందుకు ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, నిర్మాత అశోక్ బాబు, నటులు నాగబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, వడ్డే నవీన్.. కైకాల పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
కైకాలను కడసారి చూసేందుకు తరలివస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు.. - కైకాల సత్యనారాయణ చిరంజీవి నివాళి
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు తుది నివాళులు అర్పించేందుకు ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.
కైకాలను కడసారి చూసేందుకు తరలివస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు..
సినీ అభిమానులు సైతం కైకాలను కడసారి చూసేందుకు ఆయన నివాసానికి వస్తున్నారు. మరోవైపు సత్యనారాయణ అంత్యక్రియలకు మహాప్రస్థానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న కైకాల శుక్రవారం వేకువజామున కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: