Bro movie overseas collection : పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయి తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'బ్రో'. ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ పవన్ ఫ్యాన్స్‌తో హంగమాతో కళకళలాడాయి. అయితే వాస్తవానికి ఈ సినిమాపై మొదటి నుంచి కాస్త హైప్ తక్కువగానే ఉంది. అభిమానుల హంగామా తప్ప.. మిగతా ఆడియెన్స్‌లో మూవీపై పెద్దగా హైప్ క్రియేట్ అవ్వలేదు. కానీ సినిమా రిలీజయ్యాక.. సినిమా బాగుందనే టాక్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. కేవలం పవన్ ఎనర్జీతో వన్ మ్యాన్షోగా ఆకట్టుకుంటుందట.
అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. అసలీ చిత్రం 2023లో ప్రీమియర్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. బయట మీడియా కథనాల ప్రకారం.. యూఎస్ టాప్-5 తెలుగు సినిమాల ప్రీమియర్స్‌లో వెనకపడిపోయిందట.
Bro movie premieres : ఈ జాబితాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రం అగ్రస్థానంలో నిలిచిందని తెలిసింది. ప్రీమియర్స్‌తోనే ఈ చిత్రం అక్కడ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిపోయింది. 1,195,316డాలర్లను ఖాతాలో వేసుకుందట. ఆ తర్వాత 7 లక్షల డాలర్లకు($708,472) పైగా కలెక్షన్స్‌తో వీరసింహారెడ్డి రెండో స్థానాన్ని దక్కించుకున్నట్లు ఉంది. ఇక ఈ చిత్రానికి పోటీగా వచ్చిన అదే సమయంలో రిలీజైన 'వాల్తేరు వీరయ్య' సినిమా 6 లక్షల డాలర్లకు($679,036)పైగా వసూళ్లను సాధించి మూడో స్థానానికి పరిమితమైందట. ఆ తర్వాత నాలుగో స్థానాన్ని బ్రో దక్కించుకుందని తెలిసింది. అయితే ఈ మూవీ కూడా ఆరు లక్షల డాలర్లకుపైగా($647,227) అందుకుందట. ఇక ఐదో స్థానంలో నాని దసరా($637,677) నిలిచినట్లు ఆ కథనాల్లో రాసి ఉంది. అయితే ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ వల్ల ఆదిపురుష్ ఈ స్థాయి వసూళ్లను అందుకుంది. కానీ ఇక్కడ ఈ లిస్ట్‌లో చిరంజీవి, బాలయ్య చిత్రాలను 'బ్రో' క్రాస్ చేయలేకపోవడం గమనార్హం.