కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'వెయ్యి నందుల బలం.. నందీ అస్త్రం' అని పేర్కొంది. ఆర్టిస్ట్ అనీశ్గా నాగ్ చేసిన పాత్ర ఈ చిత్రంలో చాలా ప్రత్యేకమని దర్శకుడు అయాన్ ముఖర్జీ అన్నారు. పవర్ఫుల్ లుక్‌లో నాగ్‌ను చూసి అభిమానులు ఖుషీ అయిపోయారు. నాగ్ పాత్రను పరిచయం చేస్తూనే ఈ ట్రైలర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీమ్. ఈనెల 15న ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని చెప్పింది.
కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ - ఆలియాభట్‌లు హీరోహీరోయిన్లు కాగా.. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, నాగార్జునలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.