తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'బాస్‌ పార్టీ.. సాంగ్​ ఎలా ఉంది తమ్ముడు..!' - వాల్తేరు వీరయ్య ప్రోమో

వీరయ్యతో కలిసి వీరమల్లు సందడి చేశారు. అటు అన్న చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', ఇటు తమ్ముడు పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న 'హరి హర వీర మల్లు'. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో అసక్తితో ఎదురుచూస్తున్నారు. కాగా, షూటింగ్​ టైమ్​లో పవన్​, చిరంజీవి కలిసి ముచ్చటించారు.

CHIRANJEEVI PAWAN KALYAN
పవన్​ చిరంజీవి

By

Published : Nov 23, 2022, 9:40 AM IST

వీరయ్యతో కలిసి వీరమల్లు సందడి చేశారు. అటు అన్న చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', ఇటు తమ్ముడు పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న 'హరి హర వీర మల్లు'. ఈ రెండు సినిమాలూ హైదరాబాద్‌లో పక్కపక్కనే చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. అది తెలిసి పవన్‌కల్యాణ్‌ తన అన్నయ్య నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌కి వెళ్లారు. చిత్రీకరణలో ఉన్న చిరంజీవితోనూ, చిత్రబృందంతోనూ కలిసి ముచ్చటించారు.

త్వరలోనే విడుదల కానున్న 'వాల్తేరు వీరయ్య' సినిమాలోని 'బాస్‌ పార్టీ... ’ పాటని పవన్‌కల్యాణ్‌కి స్వయంగా చూపించారు చిరంజీవి. ఆ సందర్భంలోని చిత్రమే ఇది. ఫొటో చూస్తుంటే... 'పాటెలా ఉంది తమ్ముడూ' అని చిరంజీవి అడుగుతున్నట్టే ఉంది కదూ! పాట పవన్‌కల్యాణ్‌కి చాలా నచ్చిందని 'వాల్తేరు వీరయ్య'ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ తెలిపారు. అన్నదమ్ముల ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు 'హరి హర వీరమల్లు' నిర్మాత ఎ.ఎమ్‌.రత్నం, దర్శకులు క్రిష్‌, బాబీ.

ABOUT THE AUTHOR

...view details