ఇనయా సుల్తానా... 'బిగ్ బాస్'తో బుల్లితెర ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న భామ. సోషల్‌మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్‌బాస్ సీజన్ 6తో ఆడియెన్స్‌కు మరింత దగ్గరైంది. దీంతో ఆమెపై యూత్ మనసు పారేసుకుంటున్నారు. మరి, ఆమెకు ఎవరు అంటే క్రష్ తెలుసా? బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్.
ఇనయ హౌస్‌లో ఉన్నప్పుడు సోహైల్ అంటే తనకు ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంది. ఇక అతడు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ బిగ్‌బాస్6 స్టేజ్‌పై సందడి చేసిన విషయమూ తెలిసిందే. అయితే అసలు విషయమేమిటంటే ఇటీవలే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ.. సోహైల్‌కు ప్రపోజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
'నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం' అని ప్రపోజ్ చేసింది. అయితే దీనిపై సోహైల్ ఎలా స్పందించాడో తెలియాలంటే వేచి చూడండి అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇనయ ప్రేమను సోహైల్ ఓకే చేశాడా? లేదా? అన్నది త్వరలోనే తెలియనుంది. ఇక దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మీరిద్దరూ బెస్ట్ జోడీ' అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇకపోతే బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత సోహైల్ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటించిన 'లక్కీ లక్ష్మణ్' సినిమా డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోహైల్ సరసన మోక్ష నటించిన ఈ సినిమాను ఎ.ఆర్.అభి తెరకెక్కించారు.
ఇదీ చూడండి:బాలయ్య-పవన్ 'అన్‌స్టాపబుల్' షూటింగ్ షురూ.. సెలబ్రేషన్స్‌లో ఫ్యాన్స్