తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bhola Shankar OTT Streaming Partner : చిరు 'భోళాశంకర్​' మూవీ ఆ ఓటీటీలోనే .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. - భోళాశంకర్​ సినిమా ఓటీటీ పార్ట్​నర్​

Bhola Shankar OTT Streaming Partner : మెగాస్టార్​ చిరంజీవి లీడ్​ రోల్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్​'. శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?

Bhola Shankar OTT
భోళా శంకర్​ ఓటీటీ

By

Published : Aug 11, 2023, 10:44 AM IST

Updated : Aug 11, 2023, 11:40 AM IST

Bhola Shankar OTT Streaming Partner : మెగాస్టార్​ చిరంజీవి లీడ్​ రోల్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్​'. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్​ అందుకుంటోంది. ఈ క్రమంలో తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ సైతం బాగా పెరుగుతున్నాయని టాక్​. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్​ వర్గాలు అంటున్నాయి.

ఈ మూవీ పైనున్న భారీ అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎట్టకేలకు ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు మూవీ యూనిట్​ వెల్లడించింది. 'భోళాశంకర్' టైటిల్ కార్డ్స్‌పై వేసి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

Bhola Shankar Digital Partner : మరోవైపు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా తాజాగా ఓ సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. దాని ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 2వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

Bhola Shankar US Premiers :యూఎస్ ప్రీమియర్స్​ను చూసిన అభిమానులు ఈ సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. చిరు మాస్​ లుక్స్, అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్, అలాగే చిరు తమన్నా కెమిస్ట్రీ.. సినిమాకే హైలైట్​గా నిలిచిందని ఫ్యాన్స్​ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇక మూవీలోని సెకెండ్​ హాఫ్​ సినిమాకు ఓ నయా ట్విస్ట్​ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక మహతి స్వరసాగర్​ స్వరపరిచిన బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ ప్రేక్షకులు అంటున్నారు. అటు ఓవర్సీస్​లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మంచి టాక్​ అందుకుంటోందని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

Bhola Shankar Trailer :మరోవైపు జాగా విడుదలైన 'భోళాశంకర్'​ ట్రైలర్​ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరు పంచ్‌ డైలాగ్స్‌, ఎక్స్​ప్రెషన్స్​.. కీర్తి సురేశ్‌నటనతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. సోదరి సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎమెషన్స్​తో పాటు యాక్షన్​ కూడా కావాల్సినంత ఉందని తాజాగా విడుదలైన ట్రైలర్​తో నిరూపితమైంది. ఇక సినిమాలోని పాటలకు కూడా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు.

Chiranjeevi Bhola Shankar Cast :ఇక సినిమా విషయానికి వస్తే.. త‌మిళ స్టార్ హీరో అజిత్​ నటించిన సూపర్​ హిట్​ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా 'భోళాశంక‌ర్' తెర‌కెక్కింది. ఇందులో చిరంజీవి సరసన మిల్క్​ బ్యూటీ త‌మ‌న్నా న‌టించగా.. ఆయన సోద‌రిగా కీర్తి సురేశ్​ మెరిశారు. హీరో సుశాంత్, రఘుబాబు, రవిశంకర్, మురళీ శర్మ, రష్మీ గౌతమ్ వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.

'భోళా శంకర్'​ ప్రమోషన్స్​ కోసం చిరు కటౌట్​​.. టాలీవుడ్​లో అతిపెద్దదిగా రికార్డు..

'భయంతోనే ఆ పని చేశా.. స్టోరీ మంచిదైతే రీమేక్​​ చేస్తే తప్పేంటి?'.. వారికి చిరు స్ట్రాంగ్​ కౌంటర్​!

Last Updated : Aug 11, 2023, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details