Bhagavanth Kesari Kajal First Look : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ విడుదల చేసింది చిత్ర యూనిట్. కాజల్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె ఫస్ట్ లుక్‌ను రీలీజ్ చేశారు మేకర్స్. ఈ తాజా పోస్టర్లో కాజల్.. ఫోన్ మాట్లాడుతూ.. బుక్ చదువుతూ క్యూట్ లుక్‌లో కనిపించింది. తన నవ్వులతో కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది. అయితే, బాలయ్య-కాజల్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.
Bhagavath Kesari Balakrishna : అడవి బిడ్డ.. నేలకొండ 'భగవంత్ కేసరి'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు మాస్ హీరో బాలకృష్ణ. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరాకు సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణను పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ సహా శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సి. రామ్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.