తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ - కృష్ణంరాజు బాలకృష్ణ సినిమాలు

కృష్ణంరాజు కుటుంబసభ్యులను నందమూరి హీరో బాలకృష్ణ పరామర్శించారు. రెబల్​స్టార్​ మరణం ఎవరూ తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

Balakrishna went to krishnamraju house
కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ

By

Published : Oct 10, 2022, 3:16 PM IST

కృష్ణంరాజు కుటుంబసభ్యులను నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. కృష్ణంరాజు చనిపోయిన రోజు షూటింగ్ నిమిత్తం టర్కీలో ఉన్న బాలయ్య.... తన సంతాప సందేశాన్ని పంపించారు. షూటింగ్ పూర్తి చేసుకొని ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన.. సతీమణి వసుంధరతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.

కృష్ణంరాజు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రెబల్​స్టార్​తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుల్తాన్, వంశోద్ధారకుడు చిత్రాల్లో కృష్ణంరాజుతో కలిసి నటించిన రోజులు ఎప్పటికి మరిచిపోలేనివన్నారు. కృష్ణంరాజు మరణం ఎవరూ తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ

ఇదీ చూడండి: లైగర్​ ఆడకపోవడంపై విజయ్​ దేవరకొండ ఏం అన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details