Balakrishna remuneration : అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ బాలయ్యకు మాత్రం డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. బాలయ్య పైకి కాస్త కోపంగా కనిపించినప్పటికీ.. ఆయన మనసు వెన్న అని చాలా మంది అభిమానులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులు చెబుతూనే ఉంటారు. అసలాయన పేరు వింటేనే సిచ్యూవేషన్‌తో సంబంధం లేకుండా ఎవరిలోనైనా ఊపు రావాల్సిందే.
అయితే బాలయ్య ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 'అఖండ'తో మొదలైన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ జర్నీ 'వీరసింహారెడ్డి', బుల్లితెరపై టాక్‌షో అంటూ అన్ స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. ఇప్పుడు ఆయన ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి సినీ అభిమానులకు తెలిసిన విషయమే.
అయితే తాజాగా బాలయ్య బాబు గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. బాలయ్యకు తన తోటి హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది. అయినప్పటికీ బాలయ్య మిగతా హీరోలతో పోలిస్తే కాస్త తక్కువ రెమ్యూనరేషనే తీసుకుంటారట. నిర్మాతల పరిస్థితి ఆధారంగా ఆలోచించి పారితోషికాన్ని డిసైడ్ చేస్తారని తెలిసింది. వారిని ఇబ్బంది పెట్టకుండా తన కష్టానికి తగ్గట్టుగానే తీసుకుంటారట. ఈ విషయం బయట పలు కథనాల్లో రాసి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు, సినీ ప్రియులు... బాలయ్య బాబు రియల్ హీరో అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. అందుకే బాలయ్యను దర్శకనిర్మాతల హీరో అంటారని అంటున్నారు.