నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాపబుల్ -2. ఆహా వేదికగా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ కార్యక్రమంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేశారు. తన స్నేహితుడు, నటుడు గోపీచంద్‌తో కలిసి బాలయ్య షోలో పాల్గొన్నారు. అయితే తాజాగా ఆహా టీమ్ ఓ చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో.. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాక్ షోకు వస్తున్నారని గ్రాండ్‌గా స్వాగతం పలికారు. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయేలా ఉండటం విశేషం. డార్లింగ్‌ను చూసి ఆడియెన్స్ హోరెత్తించారు. ఫ్లైయింగ్ కిస్సులతో ఫిదా చేశారు. వారికి డార్లింగ్ కూడా ఫ్లయింగ్ కిస్సులివ్వడం విశేషం. ఇక ప్రభాస్ అయితే 'ఏం చెబుతున్నావ్ డార్లింగ్' అంటూ ఒక్క డైలాగ్‌తో ఆకట్టుకున్నారు.
బాలయ్యకు భయపడిపోయిన ప్రభాస్.. గోపిచంద్‌కు పెద్ద దండం పెడుతూ.. - ప్రభాస్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాపబుల్ -2కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అది ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక ప్రభాస్ వచ్చాక బాలకృష్ణ కాస్త సరదా సన్నివేశాలు చేశారు. కళ్లజోడు పైకి ఎగరేశారు. ఆ తర్వాత 'ఏయ్.. ఏం చెప్తున్నావ్ డార్లింగ్' అని ప్రభాస్ నవ్వుతూ చెప్పడం నవ్వులు పూయించింది. మరోవైపు ప్రభాస్‌ను.. బాలయ్య రమ్మని అనగా, డార్లింగ్ వద్దు సర్ అన్నట్టుగా దూరం వెళ్లిపోవడం ఆకట్టుకుంటుంది. మరోవైపు ఓకే సోఫాలో కూర్చొన్న గోపీచంద్‌కు ప్రభాస్ పెద్ద దెండం పెట్టి మీరు గొప్ప అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం కూడా నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ కార్యక్రమంలో పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట.
ఇదీ చూడండి:కనపడేది.. వచ్చే ఏడాది! బోణీ కొట్టని తెలుగు హీరోలు.. 2023 పైనే అభిమానుల ఆశలు