Balakrishna As producer: ఇప్పటికే ఎందరో నటులు, దర్శకులు నిర్మాతలుగా మారి, విజయం అందుకున్నారు. ఇప్పుడు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఆ జాబితాలోకి చేరనున్నారు. ఆయన ప్రొడ్యూసర్‌గా మారబోతున్నారు. తాజాగా ఆయన బసవ తారకరామ క్రియేషన్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించారు. ఆయన నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టు వివరాలను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం పంచుకోబోతున్నారు.
బాలకృష్ణ మరో కొత్త అవతారం.. ఈ సారి... - బసవ తారకరామ క్రియేషన్స్
Balakrishna As producer: ఇప్పటికే నటుడిగా, వ్యాఖ్యతగా జోరు చూపిస్తున్న హీరో బాలకృష్ణ.. ఈ సారి మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. నిర్మాతగా మారి ఓ కొత్త సినిమాను రూపొందించునున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం తెలపనున్నారు.
పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలకృష్ణ.. నిర్మాతగా ఎలాంటి కథను అందిస్తారోననే ఆసక్తి అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో నెలకొంది. 'అఖండ'తో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ సినిమా. ఆ తర్వాత, దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇదీ చూడండి: మరోసారి నిర్మాతగా పవర్ స్టార్.. రూమర్స్‌కు హీరో సూర్య చెక్