భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. తన ప్రియురాలు, బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి కుమార్తె, నటి అతియాశెట్టి మెడలో మూడుముళ్లు వేశాడు. మహారాష్ట్ర, ఖండాలలోని సునీల్‌శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో సోమవారం సాయంత్రం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అతియా తండ్రి సునీల్ శెట్టి అధికారికంగా ధ్రువీకరించారు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం వంద మంది అతిథులను మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.
ఒక్కటైన రాహుల్-అతియా.. అఫీషియల్‌గా మామ అయ్యానన్న సునీల్ శెట్టి.. - undefined
ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి వివాహబంధంలోకి అడుగుపెట్టేశారు. ఈ విషయాన్ని అతియా తండ్రి సునీల్ శెట్టి అధికారికంగా తెలిపారు.
Athiya Shetty and KL Rahul tie knot in Khandala said by sunil shetty
అయితే రాహుల్- అతియా వివాహం జరిగిన అనంతరం.. సునీల్ శెట్టి మీడియాతో మట్లాడారు. "రాహుల్- అతియా వివాహం జరిగిపోయింది. నేను అధికారంగా మామను అయ్యాను" అని తెలిపారు. ఆ సమయంలో సునీల్ శెట్టి, ఆయన కుమారుడు అహాన్ శెట్టి.. సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. అయితే సునీల్ శెట్టి ఫామ్హౌన్.. అతిథులతో కళకళాలాడుతున్నట్లు తెలుస్తోంది.