Animal Teaser :బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మూవీమేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఇక విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించి.. నెట్టింటి హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో రణ్‌బీర్ లుక్‌తో పాటు అతని యాక్షన్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. అయితే ఈ టీజర్లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటంటే..
రష్మిక-రణబీర్ సంభాషణతో మొదలైన ఈ టీజర్.. సెకండ్ షాట్ నుంచి వైలెంట్ మోడ్‌లోకి వెళ్ళింది. ఇక అనిల్ కపూర్, రణ్‌బీర్ మధ్య తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను టీజర్లో చూపించే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా రణ్‌బీర్‌ని మూడు వేరియేషన్స్‌లో చూపించారు. ముఖ్యంగా లాంగ్ హెయిర్‌లో రణబీర్ 'అర్జున్ రెడ్డి'ని మించిపోయేలా కనిపించారు.