Animal OTT Release : బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ - డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన 'యానిమల్ మూవీ' మంచి సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతోంది. అయితే ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించించిన సినీ1 స్టూడియోస్ ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ చేయకుండా స్టే విధించాలంటూ దిల్లీ హై కోర్టును ఆశ్రయించింది.
ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసింగ్ సంస్థ టి-సిరీస్ తో కుదుర్చుకున్న తమ ఒప్పందం ఉల్లంఘనకు గురైందని, అంతే కాకుండా యానిమల్లో 35% ప్రాఫిట్ షేర్, మేథో సంపత్తి హక్కులు ఉన్నాయంటూ సినీ1 స్టూడియోస్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ సినిమాను నిర్మించడం, ప్రమోట్ చేయడం, విడుదల చేసే విషయంలో టి-సిరీస్ తమ అనుమతిని తీసుకోలేదంటూ సినీ1 ఆ పిటీషన్లో పేర్కొంది.
మరోవైపు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ టి-సిరీస్ తమ ప్రాఫిట్ షేరింగ్ ఒప్పందాన్ని గౌరవించలేదని, ఆర్థిక నష్టపరిహారం అందించడంలోనూ విఫలమైందంటూ సినీ1 ఆరోపించింది.అంతే కాకుండా 'యానిమల్'కు సీక్వెల్గా తెరకెక్కనున్న 'యానిమల్ పార్క్' మూవీని టి-సిరీస్ ప్రకటించడాన్ని వ్యతిరేకించింది. ఈ ప్రాజెక్టు విషయంలో తమకు హక్కులు వర్తిస్తాయని, తమతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం కచ్చితంగా ఉందంటూ కోర్టుకు వివరణ ఇచ్చింది.