పవన్ కల్యాణ్-అలీ.. ఇండస్ట్రీలో ఎంత మంచి స్నేహితులో చాలా మందికి తెలిసిన విషయమే. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం జరిగిన అలీ కూతురి పెళ్లికి సైతం పవన్ హాజరుకాలేదు. దాంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ పెళ్లికి ఎందుకు రాలేదో అలీ చెప్పడంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడింది. ఇక తాజాగా వచ్చిన అలీతో సరదాగా ప్రోమోలో ఇద్దరి మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అలీ.
నాకు పవన్ కల్యాణ్ మధ్య గ్యాప్ ఎలా వచ్చిందంటే: అలీ - యాంకర్ సుమ ఆలీతో సరదాగా
పవన్ కల్యాణ్ తనకు మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు కమెడియన్ అలీ. ఆ సంగతులు..
గెస్ట్‌గా వచ్చిన యాంకర్ సుమ.. 'మీకు పవన్ కల్యాణ్‌కు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది?' అని ప్రశ్నించగా.. "నాకు పవన్‌కు మధ్య గ్యాప్ లేదు. దానిని బయటి వారే సృష్టించారు. మా అమ్మాయి పెళ్లికి కూడా వస్తా అన్నారు. కానీ ఫ్లైట్ మిస్ కావడంతో రాలేకపోయారు" అంటూ అలీ చెప్పుకొచ్చారు. ఇక మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి అని సుమ అడిగితే.. అలీ సిగ్గుపడుతూ తన తొలి ప్రేమ గురించి వివరించారు. అలాగే తన చిన్నతనంలో జరిగిన సంఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ఇదీ చూడండి:అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. నా లక్ష్యం చేరుకున్నానంటూ పోస్ట్