తన యాంకరింగ్‌తో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ క్వీన్ సుమ. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్వించే ఈమె తన మంచి మనసును చాటుకున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్ కోసం మద్రాస్ ఐఐటీ కాలేజ్‌కు వెళ్లిన సుమ అక్కడున్న విద్యార్థులతో ముచ్చటించారు. అలా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను నెమరవేసుకున్నారు. తాను చేసే సమాజా సేవ గురించి వివరించారు.
యాంకర్ సుమ మంచి మనసు.. 30 మంది విద్యార్థులను దత్తత - యాంకర్ సుమ ఆర్గనైజేషన్
తన యాంకరింగ్‌తో అందరిని కడుపుబ్బా నవ్వించే సుమ తన మంచి మనుసును చాటుకున్నారు. సమాజం కోసం తన వంతు కృషి చేసేందుకు ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే..
"నేను 15 ఏళ్లకే యాంకరింగ్ స్టార్ట్ చేశాను. జీవితంలో పేరు రావాలంటే ఊరకే రాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగు నేర్చుకుని యాంకరింగ్ మొదలు పెట్టిన నేను ఇంటర్‌మీడియట్‌లో బైపీసీ చదివాను. డిగ్రీలో బి.కామ్ తర్వాత ఎం.కామ్ చేశాను. అకౌంటెంట్ తర్వాత టీచర్ అవుదామని అనుకున్న నేను యాంకరింగ్‌లో అడుగు పెట్టాను" అని అన్నారు.
అయితే సమాజం కోసం తన వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో 'ఫెస్టివల్ ఆఫ్ జాయ్' అనే సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. "మా సంస్థ ద్వారా 30 మంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నాం. వాళ్లు సెటిల్ అయ్యే వరకు మా వంతు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. నాతో పాటు ఎఫ్ఐఏ సంస్థ, జైపుర్ లింబ్స్ అసోసియేట్ అయ్యారు" అని తెలియజేశారు. దీంతో సుమ మంచి మాటకారే కాదు మంచి మనసున్న వ్యక్తి అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆ చిన్నారుల కోసం తను చేస్తున్నది చాలా గొప్ప పని అంటూ కొనియాడుతున్నారు. కాగా ప్రస్తుతం పలు సినిమాల ఈవెంట్లతో బిజీగా ఉన్న సుమ ఈటీవీలో సుమా అడ్డా అనే టాక్షోతోనూ అలరిస్తున్నారు.