తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆలియా- రణ్​బీర్​ వెడ్డింగ్ వైబ్స్.. సెలబ్రిటీల సందడి! - alia ranbir news

Alia ranbir kapoor marriage: బాలీవుడ్​ ప్రేమ జంట రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరి కొన్ని గంటల్లో వీరి పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్​ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై సందడి చేస్తున్నారు.

Alia Ranbir kapoor marriage
Alia Ranbir kapoor marriage

By

Published : Apr 14, 2022, 9:18 AM IST

Updated : Apr 14, 2022, 9:28 AM IST

Alia ranbir kapoor marriage: బాలీవుడ్‌ ప్రేమ జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. వీరి వివాహనికి సంబంధించిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుక.. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబయిలోని రణ్‌బీర్‌ నివాసం 'వాస్తు'లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుక సందడిగా జరిగింది. దీనికి బాలీవుడ్​ బ్యూటీస్​ కరీష్మాకపూర్​, కరీనకపూర్​ సహా ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, ఇతర బాలీవుడ్‌ ప్రముఖులు తరలి వచ్చారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు లీక్​ అవ్వకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందుకే ఎవరి ఫొటోలు బయటకు రావట్లేదు.

43 ఏళ్ల క్రితం రణ్‌బీర్‌ తల్లిదండ్రులు నీతూ కపూర్‌, రిషి కపూర్‌ల నిశ్చితార్థం జరిగిన రోజునే వీరి మెహందీ వేడుక జరగడం మరో విశేషం. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫొటోను నీతూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇక ఈ జంట పెళ్లి కోసం.. అభిమానులతోపాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పెళ్లి నేపథ్యంలో అభిమానులు కూడా తమ స్టార్స్​ కోసం.. ప్రత్యేకమైన గిఫ్ట్స్​ కూడా పంపుతున్నారు.

Last Updated : Apr 14, 2022, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details