తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రణ్​బీర్.. నీ పెళ్లితో నా జీవితం నాశనమైపోయింది'.. - alia bhatt and ranbir kapoor wedding

అమ్మాయిల కలల రాకుమారుడు రణ్‌బీర్ కపూర్, బాలీవుడ్​ బ్యూటీ అలియా భట్( రాలియా) పెళ్లి నేపథ్యంలో సోషల్​ మీడియాలో మీమ్స్​ తెగ వైరల్​ అవుతున్నాయి. రణ్‌బీర్-ఆలియా పెళ్లి చేసుకోవడం.. తాము భగ్న ప్రేమికులుగా మారినట్లు అభిమానులు క్రియేట్​ చేసిన మీమ్స్​​ తెగ ఆకట్టుకుంటున్నాయి.

Ranbir Kapoor-Alia Bhatt
రణ్‌బీర్ కపూర్, అలియా భట్

By

Published : Apr 14, 2022, 9:31 PM IST

Updated : Apr 14, 2022, 11:06 PM IST

బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ లవర్ బాయ్‌ రణ్ బీర్, సొట్ట బుగ్గలతో క్యూట్​ క్యూట్​గా కనిపించే ఆలియా భట్​ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్​ సెలబ్రిటీలతో పాటు ఇద్దరు ఫాన్స్​ ఆనందంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో నూతన దంపతులకు సోషల్​ మీడియా వేదికగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీరిద్దరి పెళ్లి వల్ల కొందరు నిర్వేదంలో మునిగిపోయారు. రణ్​బీర్​ను ఆరాధించే అమ్మాయిలు.. ఆలియాను ప్రేమించే అబ్బాయిలు.. మీమ్స్ రూపంలో తమ భగ్నమైన ప్రేమను తెలియజేస్తున్నారు. సోషల్​ మీడియాలో ఆ మీమ్స్​ ఆకట్టుకుంటున్నాయి. వైరల్​ అయిన మీమ్స్​ చూసి సోషల్​ మీడియా యూజర్స్​ నవ్వుకుంటున్నారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి..

'నా జీవితం సర్వ నాశనం అయిపోయింది' అంటూ ఓ రణ్​బీర్​ అభిమాని పోస్ట్​ చేయగా.. 'నేను నీ పెళ్లి చూడలేను' అని ఉన్న ఆలియా అభిమాని మీమ్​ ఆకట్టుకుంటోంది. పెళ్లి నేపథ్యంలో రణ్​బీర్​ ఇంటి ముందు జర్నలిస్టులు ఏకంగా వంట చేస్తున్న ఫొటో తెగ నవ్విస్తోంది. ఇలాంటి అనేక మీమ్స్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి:అబ్బ! రణ్​బీర్ మరీ రొమాంటిక్​.. ఆలియాను ఎత్తుకొని ఏం చేశాడంటే..

Last Updated : Apr 14, 2022, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details