బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటించింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. తాజాగా ఆలియా భట్‌కు చెందిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రసవానంతరం అలియా యోగా చేస్తున్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది.
'పొరపాటున అలా చేశారా?'.. అలియా భట్ పోస్ట్‌కు సోనూసూద్ ఫన్నీ రిప్లై - ఆలియా భట్ యోగా ఫొటోలు
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్ చేసింది. దీనికి ప్రముఖ నటుడు సోనూసూద్ ఫన్నీ రిప్లై ఇచ్చారు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఇంతకీ సోనూ సూద్ ఏమన్నారో తెలుసా..
"ప్రసవానంతరం ఒకటిన్నర నెలల తర్వాత, నా కోర్‌తో నా కనెక్షన్‌ని క్రమంగా పునర్నిర్మించుకుంటున్న. నా యోగా గురువు మార్గదర్శకత్వంలో ఈ తలకిందుల యోగా ఆసనం వేయగలిగాను. నా లాంటి తల్లులకు చెప్పేది ఒక్కటే.. ప్రసవానంతరం మీ శరీరం చెప్పినట్టు వినడం చాలా ముఖ్యం. మీ పొట్ట చెప్పింది ఏమీ చేయవద్దు. నేను వర్కవుట్ మొదలు పెట్టినప్పుడు.. దాదాపు రెండు వారాల పాటు ఊపిరి పీల్చుకోవడం, నడవడం.. నా స్టబిలిటీని, బ్యాలన్స్‌ను మళ్లీ కనుగొన్నాను. అన్ని విధాలుగా ప్రసవం ఒక అద్భుతం. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుంది. ఏదైనా వ్యాయామం లాంటిది చేసే ముందు దయచేసి మీ డాక్టర్‌తో మాట్లాడండి" అంటూ పోస్ట్ కింద రాసుకొచ్చింది.
కాగా ఈ పోస్ట్‌కి చాలా మంది సెలెబ్రెటీలు రియాక్ట్ అయ్యారు. అద్భతంగా చేశావని కొనియాడారు. కానీ బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ చేసి కామెంట్ నవ్వులు పూయిస్తోంది. ఆలియా తలకిందుల యోగా ఫొటో చూసి ఆశ్చర్యపోయిన సోనూ సూద్.. ' పొరపాటున ఆ ఫొటోను నువ్వు తలకిందులుగా పోస్ట్ చేశావ్ ' అని రాసుకొచ్చారు. దానికి ఓ నవ్వుతున్న ఎమోజి జత చేశారు. దీంతో ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.