అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య.. హీరోయిన్ సమంత నుంచి డివోర్స్ తీసుకున్నాక కెరీర్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. అయితే ఈ సమయంలోనే నాగ చైతన్య పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. చైతూ తన అభిరుచికి తగ్గట్లుగా ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్గా అందులోకి గృహప్రవేశం కూడా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. హడావుడి, ఆర్భాటం లేకుండా సింపుల్‌గా చైతూ తన కొత్త ఇంట్లోకి వెళ్లారట.
నాగ చైతన్య-సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ఓ కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు మురళి మోహన్‌కు చెందిన ఇంటినే వారు కొనుకున్నారు. ఈ విషయాన్ని మురళి మోహనే గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంట్లోనే సామ్-చైతూ కాపురం చేశారు. అయితే డివొర్స్ అయ్యాక చైతూ ఆ ఇంటిని వదిలి తన తండ్రి దగ్గరికి వెళ్లిపోయారు. ఆ తర్వాత సమంతనే ఆ ఇంటిని తీసుకున్నట్లు తెలిసింది.
అయితే చైతూ ఎప్పటి నుంచో తన అభిరుచికి తగ్గట్లుగా ఓ లగ్జరీ మోడ్రన్ ఇంటిని కట్టుకోవాలని ఆశపడ్డారట. అనుకున్నట్టే తన తండ్రి నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఒక స్థలం కొనుక్కొని చకచకా ఓ లగ్జరీ ఇంటిని కట్టించుకున్నారట. గార్డెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్, థియేటర్.. ఇలా అన్ని సౌకర్యాలు ఉండేలా విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారట. రీసెంట్‌గానే ఆయన ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి. తనకు సంబంధించిన సామాను కూడా షిప్ట్ చేసుకున్నారని అంటున్నారు. ఇక నుంచి చైతూ ఆ కొత్త ఇంట్లోనే ఉంటారని అంటున్నారు. ఇకపోతే చాలా రోజులుగా చేతూ రెండో పెళ్లి, ప్రేమ గురించి పలు రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇక చైతూ కస్టడీ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. 'బంగార్రాజు' తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రమిది. ఇకపోతే తాజాగా అభిమానులు ఊహించినట్లే ఈ కస్టడీ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రంలో చైతూ ఇంటెన్స్ లుక్‌లో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి అదరగొట్టారు. అలానే ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సమకూర్చిన స్వరాలు హైలైట్‌గా నిలిచాయి.
ఇదీ చూడండి:పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య 'కస్టడీ' టీజర్.. మీరు చూశారా?