Adivi Sesh Pan India Movie :సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తూ యాక్షన్ చిత్రాలకు సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు టాలీవుడ్ నటుడు అడివిశేష్. 'హిట్', 'ఎవరు', 'గూఢచారి' లాంటి థ్రిల్లర్స్‌తో ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు మరో యాక్షన్ మూవీలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈయనతో పాటు కోలీవుడ్ నటి శ్రుతి హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. ఈ విషయాన్ని మేకర్స్ మంగళవారం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నటి సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. 'క్షణం', 'గూడాచారి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేసిన షనైల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో వేర్వేరుగా చిత్రీకరిస్తామని మూవీ టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే జీ2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నశేష్ త్వరలో ఈ సినిమా షెడ్యూల్‌తో మరింత బిజీ కానున్నారని సమాచారం.
G2 Movie Shooting Update : ఇక తాజాగా 'జీ2' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. భారీ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అయితే తాజాగా షూటింగ్ కోసం 5 అంతస్తుల లావిష్ గ్లాస్ సెట్‌ను చిత్ర బృందంనిర్మించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.