తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శత్రువులుగా మారిన ప్రేమికులు- అడివి శేష్ 'డెకాయిట్' టీజర్​ రిలీజ్ - అడివి శేషు శ్రుతి హాసన్ సినిమా

Adivi Sesh Dacoit Movie Teaser : యంగ్​ హీరో అడివి శేష్ - శ్రుతిహాసన్​ జంటగా పాన్​ ఇండియా లెవల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. బుధవారం ఈ సినిమా టైటిల్​తోపాటు టీజర్​ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

Adivi Sesh Dacoit Movie Teaser
Adivi Sesh Dacoit Movie Teaser

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 6:05 PM IST

Updated : Dec 20, 2023, 8:16 PM IST

Adivi Sesh Dacoit Movie Teaser : సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తూ యాక్షన్​ చిత్రాలకు సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు టాలీవుడ్ నటుడు అడవి శేష్​. ఈ స్టార్​ హీరో మరో యాక్షన్​ మూవీకి సిద్ధమయ్యారు. శ్రుతిహాసన్​ కథానాయికగా షానీల్​ డియో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ యాక్షన్​ సినిమాకు టైటిల్​ను ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. 'డెకాయిట్'​ అని వెరైటీ టైటిల్​ను ఖరారు చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. మీరూ ఆ టీజర్ చూసేయండి.

కాల్పులు, బాంబు శబ్దాలు, పోలీసుల మృతదేహాలు కనిపించే సీన్స్​తో టీజర్​ మొదలవుతుంది. తర్వాత, అడవి శేష్​ జూలియట్​ ఎన్ని ఏళ్లు అయ్యింది మనం కలిసి అనే డైలాగ్​తో ఎంట్రీ ఇస్తారు. ఆ సీన్​లో​ శేష్​ మెడపై చూస్తే గాడ్​ ఈజ్​ డెడ్​ అని టాటూ కనిపిస్తుంది. ఆ తర్వాత, కలిసి కాదు విడిపోయి అని శ్రుతి హాసన్​ నుంచి సమాధానం వస్తుంది. వీళ్లు గతంలోనే ప్రేమించుకుని విడిపోయి ఉంటారని టీజర్​లో అర్థమవుతుంది. అది కూడా ఒకరిని మరొకరు చంపుకునేంత పగతో రగిలిపోతారు. అనుకోకుండా చాలా సంవత్సరాల తర్వతా కలిసిన వీళ్లు ఒకరు తుపాకీ పట్టుకుని మరోకరు మెషీన్​ గన్​ పట్టుకుని కాల్చేందుకు సిద్ధ పడతారు. మొత్తం మీద టీజర్​ను ఆసక్తిరంగా చూపించారు మేకర్స్. బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా బాగా హైలైట్​​గా నిలిచింది.

సినిమా విషయానికొస్తే, ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నటి సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'క్షణం', 'గూఢచారి' లాంటి బ్లాక్ బస్టర్‌ సినిమాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేసిన షనైల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్​గా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో వేర్వేరుగా షూటింగ్​ జరుపుతామని మూవీ టీమ్ తెలిపింది.

Goodachari 2 Movie: 'గూఢచారి 2' సినిమాకు అడివి శేష్‌ స్వయంగా స్టోరీ అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు ఐదు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ఇక ఈ సినిమాలో శేష్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ బనితా సంధు ఈ సినిమాలో శేష్​కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్​ డైరెక్టర్​గా వ్యవహరించనున్నారు.

అడివి శేష్​కు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్​- శ్రుతి హాసన్​కు జోడీగా

అడివి శేష్​పై ఫ్యాన్​ కంప్లైంట్​ - అలా చేయకపోతే!

Last Updated : Dec 20, 2023, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details