ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంత స్నేహం ఉంటుందో.. అలాగే వారి కుటుంబాల మధ్య కూడా అంతే సానిహిత్యం ఉంటుంది. అయితే హీరోలు హీరోలకు మధ్య స్నేహం అనేది మామూలే కానీ.. హీరోల పిల్లలతో మరో కథానాయకుడు స్నేహం చేయడమనేది ఆసక్తికరమైన విషయమే. ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఫ్రెండ్షిప్ అలాంటిదే.
అడివి శేష్-అకీరా నందన్ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వీరిద్దరూ చాలా సార్లు ఒకరి గురించి మరొకరు ప్రస్తావన తీసుకొస్తుంటారు. ముఖ్యంగా అడివి శేష్‌కు అకీరా అంటే చాలా ఇష్టం. అకీరా తన తమ్ముడు, బెస్ట్ ఫ్రెండ్ అని అంటుంటాడు. అలాగే అకీరా ఏం చేసినా శేష్ సపోర్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో విష్ చేస్తుంటాడు. అయితే నటుడిగా, రైటర్‌గా ఇప్పటికే అడివి శేష్ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కథలను తానే రాసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్‌తో దూసుకుపోతున్నాడు. మరోవైపు అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.