తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Actress Tamannaah : 'ఆ విషయంలో వయసు అసలు పట్టించుకోను.. ఇప్పట్లో పెళ్లి ప్లాన్స్ లేవు' - భోళాశంకర్ సినిమా విడుదల

Actress Tamannaah : తెలుగు, తమిళం భాషల్లోల హీరోయిన్ తమన్నా నటించిన.. రెండు భారీ చిత్రాలు ఒక రోజు గ్యాప్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కెరీర్​తో పాటు పర్సనల్ విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు..

Tamanna Interview
తమన్నా ఇంటర్వ్యూ

By

Published : Aug 5, 2023, 7:26 AM IST

Actress Tamannaah :మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్​లాంటి పెద్ద హీరోల సరసన నటించడం వల్ల తన కల నిజమైందన్నారు హీరోయిన్ తమన్నా. ఇద్దరు ఆగ్ర కథానాయకుల సినిమాలతో ఇటు తెలుగు, అటు తమిళ సినిమా ప్రేక్షకులను ఒక్క రోజు గ్యాప్​లో పలకరించడం మంచి అనుభూతినిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సినిమాలతో పాటు, వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.

Thamanna Bhola Shankar : తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహ రెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చినా.. ఆయనతో డ్యాన్స్ చేసే ఛాన్స్​ రాలేదని తమన్నా అన్నారు. కాగా తాజా భోళా శంకర్సినిమాతో ఆ కాస్త లోటు తీరిపోయిందన్నారు. అయితే భోళా శంకర్​లో సినిమా మిల్క్ బ్యూటీ సాంగ్​లో.. చిరంజీవితో కలిసి ఓ హుక్​స్టెప్​ చేశారట. మిగతా స్టెప్స్ కూడా చాలా గ్రేస్​ఫుల్​గా ఉంటాయని చెప్పుకొచ్చింది ఈ భామ. అయితే ఈ పాటకు అంతగా ప్రాక్టీస్ ఏమీ చేయకుండానే షూట్ చేసినట్లు తెలిపారు తమన్నా.

Tamanna Jailer : తమిళంలో నటించిన జైలర్సినిమాలో తన పాత్ర చిన్నదే అయినా.. భారీ తారాగణముంటుందన్నారు. అయితే ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు గడిచినా.. హీరోల సరసన నటించేటప్పుడు కేవలం పాత్ర గురించే తప్పా.. సహ నటుల వయసు గురించి పట్టించుకోనని తెలిపారు. వయసులో చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్నీ తోటి నటులుగానే చూస్తానని అన్నారు.

కాగా ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రస్తావన రాగా.. ఆ విషయాన్ని కూడా సింపుల్​గా హ్యాండిల్ చేశారు తమన్నా. తాను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మనిషినని.. ప్రేమ విషయాన్ని సైతం తానే బయటపెట్టానని తెలిపారు. అలాగే పెళ్లికి ఇప్పట్లో ఎలాంటి ప్లాన్లు లేవు అని.. సమయం వచ్చినప్పుడు స్వయంగా తనే ప్రకటిస్తానని తమన్నా అన్నారు.

ఇక తమిళంలో 'అరణ్‌మణై', మలయాళంలో 'బాంద్రా' సినిమాలతో కెరీర్​లో దూసుకుపోతున్నారు తమన్నా. రీసెంట్​గా 'జీ కర్దా', 'లస్ట్​ స్టోరీస్ - 2' లాంటి వెబ్​ సిరీస్​లతోనూ ప్రేక్షకును ఆకట్టున్నారు.

ABOUT THE AUTHOR

...view details