తమిళంలో అగ్ర కథానాయకుడైన శరత్‌కుమార్ అంటే సినీ ప్రపంచంలో తెలియనని వారుండరు. తన విలక్షణ నటనతో తండ్రిగా, అన్నగా, అమ్మాయిల మనసులు దోచే హీరోగా, ఇలా ఎలాంటి పాత్ర ఇచ్చిన ఇట్టే ఒదిగిపోతారు. కోలీవుడ్‌లో సుప్రీం స్టార్‌గా పేరు తెచ్చుకున్న శరత్‌కుమార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఉత్సాహంగా ఉంటారు. ఆరుపదుల వయసులోనూ యంగ్ అండ్ డైనమిక్‌గా నేటి హీరోలకు పోటీగా నటిస్తుంటారు.
తాజాగా పొన్నియన్ సెల్వన్-Iలో ఓ కీలక పాత్ర పోషించారు శరత్ కుమార్. అటు తమిళంలో ఇటు తెలుగులోనే కాదు బీటౌన్‌లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంతటి బిజీ స్టార్‌కి ఇప్పుడు కాల్షీట్లో డేట్స్ ఖాళీ లేవట.. దానికి కారణం ఆయన ఇంకొన్ని ప్రాజెక్టుల్లో నటించడమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఇప్పుడు ఆయన లిస్ట్‌లో ఉన్నాయి. త్వరలో పట్టాలెక్కనున్న పెద్ద ప్రాజెక్టులన్నీ ఈ హీరో కాల్షీట్లో డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. తెలుగు తమిళంలోనే కాకుండా హిందీలోనూ పలు చిత్రాలు నటించనున్నారు.