తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆమిర్ షాకింగ్​ నిర్ణయం.. ఏకంగా రూ.100కోట్లను.. - Laal singh Chaddha movie collections

ఎప్పుడూ అదిరిపోయే సినిమాలతో అలరించే బాలీవుడ్​ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.. ఈ సారి లాల్​సింగ్​ చడ్డా సినిమాతో కాస్త నిరాశపరిచారు. అయితే ఇప్పుడాయన​ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే.

laal singh chaddha
ఆమిర్ షాకింగ్​ నిర్ణయం.. ఏకంగా రూ.100కోట్లను

By

Published : Sep 1, 2022, 6:54 AM IST

'లాల్‌ సింగ్‌ చడ్డా' విషయంలో ఇప్పటికే భారీ నష్టాలను చవి చూసిన బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఇప్పుడు మరో నష్టాన్ని తన భుజాలపై వేసుకున్నారు. ఈ సినిమా నష్టాన్ని తగ్గించడానికి తన పారితోషికాన్నీ వదులుకోనున్నారు. 'లాల్‌ సింగ్ చడ్డా' మొత్తం బడ్జెట్‌ రూ.180 కోట్లు కాగా ఆమిర్‌, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం గత నాలుగేళ్లుగా వేరే ఏ చిత్రాన్నీ ఆమిర్‌ అంగీకరించలేదు. 'విక్రమ్‌ వేద' లాంటి సినిమాలను సైతం వదులుకున్నారు. ఆగస్టు 11న విడుదలైన ‘లాల్‌ సింగ్‌ చడ్డా' బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యింది. ఇప్పుడు ఆ చిత్రం మిగిల్చిన నష్టాలను పూడ్చడానికి ఆమిర్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాకుగానూ ఆమిర్‌ రెమ్యూనరేషన్‌ రూ.50కోట్లు కాగా, ఇప్పుడు ఆ మొత్తం సొమ్ముని వదులుకుని నిర్మాతలకు నష్టాన్ని తగ్గించాలనుకుంటున్నారట. ఈ నిర్ణయంతో ఆమిర్‌కు ఈ చిత్రంపై మొత్తం రూ.వందకోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇప్పటివరకు 'లాల్‌ సింగ్‌ చడ్డా' కనీసం రూ.వందకోట్ల వసూళ్లను అందుకోలేదని బాక్సాఫీస్‌ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో ఆమిర్‌ చిత్రమేది రూ.వందకోట్ల మార్కుని అందుకోకుండా లేదు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఇప్పటివరకు రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో కరీనాకపూర్‌ కథానాయిక కాగా, ప్రముఖ యువనటుడు నాగచైతన్య కీలకపాత్ర పోషించాడు.

ఇదీ చూడండి: ఆ విషయంలో నేనూ బాధితుడినే: చిరంజీవి

ABOUT THE AUTHOR

...view details