Ira Khan Engagement: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు, ఫిటెనెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ఆమె వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ముంబయిలో వేడుకగా జరిగింది. ఆమిర్‌ఖాన్, ఐరా ఖాన్ తల్లి రీనా దత్తా, కిరణ్ రావు, ఫాతిమా సనా షేక్, ఇమ్రాన్ ఖాన్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని నూతన జంటను అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఘనంగా ఆమిర్ ఖాన్ కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్ - ఆమిర్‌ఖాన్ తాజా వార్లు
నటుడు ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ నిశ్చితార్థం జరిగింది. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల ఫొటోలు వైరల్‌గా మారాయి.
Ira Khan Engagement
ఆమిర్ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న నుపుర్ వద్దే ఐరా సైతం ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. వీరి బంధం గురించి 2020 నుంచే వార్తలు వస్తున్నప్పటికీ.. ఇటీవల ఓ వీడియోతో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించింది ఈ జంట. ఈక్రమంలోనే కుటుంబసభ్యుల అంగీకారంతో వీరి నిశ్చితార్థం జరిగింది.
Last Updated : Nov 19, 2022, 11:03 AM IST