2024 Sankranthi Movies : పండగలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటాయి. అలా ఈ ఏడాది సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలు (2024 sankranthi movies) సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ జాబితా నుంచి తాజాగా ఈగల్ వాయిదా పడింది. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందనే ఆలోచనతో వెనక్కి తగ్గింది! దీంతో, మహేశ్‌బాబు 'గుంటూరు కారం'(జనవరి 12), తేజ సజ్జ 'హను-మాన్'(జనవరి 12), వెంకటేశ్ సైంధవ్(జనవరి 13), నాగార్జున 'నా సామిరంగ' (జనవరి 14) 2024 సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి.
ఈ సినిమాలపై అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, నెట్టింట్లో సమాచారం దొరికినా దాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అన్న ఆసక్తితోనూ ఉన్నారు. అయితే సాధారణంగానే ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా బడ్జెట్ ఎంత, అందులో నటించిన హీరోహీరోయిన్ల పారితోషికం ఎంత అనే విషయాలను తెలుసుకునే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ముగ్గుల పండక్కి రాబోయే సినిమాల హీరోల రెమ్యునరేషన్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. వాటికి సంబంధించిన కథనాలు బయట చక్కర్లు కొడుతున్నాయి.
Gunturu karam Mahesh Babu Remuneration :ఈ సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల్లో పెద్దది, ఆడియెన్స్‌లో బాగా హైప్ ఉన్న సినిమా SSMB 28 గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రిపీట్ కాంబోతున్న ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ దాదాపు రూ.70కోట్లు తీసుకున్నాడని కథనాలు కనిపిస్తున్నాయి.
Hanuman Teja Sajja Remuneration : గుంటూరు కారం తర్వాత హైప్ ఉన్న సినిమా హనుమాన్. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం తేజ సజ్జా రూ.కోటికి పైగా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.