Gadar 2 Movie Telugu Review : దేశభక్తి తరహా చిత్రాలకు సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ స్కోప్ ఉంటుంది. అలాంటిది.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆ జోనర్ చిత్రానికి సీక్వెల్ వస్తుందంటే.. హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చిత్రమే గదర్-2. బాలీవుడ్ తెరపై రెండు దశాబ్దాల క్రితం (2001లో) విడుదలై, సంచలన విజయం సాధించిన "గదర్ - ఏక్ ప్రేమ్ కథా" చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన గదర్-2 ప్రేక్షకులను అలరించిందా? ప్రీక్వెల్ రేంజ్ ను అందుకుందా? ట్విట్టర్ రివ్యూ ఏం చెబుతోంది? అన్నది ఇప్పుడు చూద్దాం.
సన్నీ డియోల్-అమీషా పటేల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన "గదర్ -1" చిత్రం.. హిందీలో మోస్ట్ వాచ్డ్ మూవీస్ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం సీక్వెల్ (Gadar 2 Review) ను చూసేందుకు జనాలు పోటీపడ్డారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్సే మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ షారూక్ "పఠాన్" కన్నా అధికంగా ముందస్తు టికెట్లు బుక్ అయ్యాయంటే.. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
Bhola Shankar Twitter Review : చిరంజీవి 'భోళాశంకర్' ఎలా ఉందంటే ?
1971 నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలోని పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మన దేశంలోని పంజాబ్ లో నివసించే తారాసింగ్ (సన్నీ డియోల్), సకీనా (అమీషా పటేల్)ల కుమారుడు చరణ్ జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ)ను పాకిస్థాన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. బంధించి చిత్ర హింసలు పెడుతుంది. దీంతో.. తన కుమారుడిని రక్షించుకునేందుకు పాక్ బయలుదేరుతాడు తారా సింగ్. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? తన కుమారుడిని రక్షించుకున్నాడా.. లేదా? అన్నదే కథ.
Gadar 2 Movie Review in Telugu : తారాసింగ్-సకీనా జంట మరోసారి మ్యాజిక్ చేసిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తారాసింగ్ పాత్రలో సన్నీడియోల్ జీవించాడని.. పవర్ ఫుల్ యాక్టింగ్ తో అద్దరగొట్టాడని ట్వీట్ చేస్తున్నారు. సినిమాలో డైలాగ్స్ సూపర్ గా పేలాయని చెబుతున్నారు. సన్నీ అభిమానులు గోలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. పాటల చిత్రీకరణ కూడా అద్భుతంగా కుదిరిందని పోస్టు చేస్తున్నారు.
ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని అనిల్ శర్మ తెరకెక్కించారు. కమల్ ముఖుత్ తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. సీక్వెల్ ప్రకటించిన నాటినుంచే.. ఈ చిత్ర ప్రేమికులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అర్థమైంది. దాదాపు 1లక్షా 41,500 టిక్కెట్లు ముందస్తుగా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం.. గదర్ 2 చిత్రం.. తొలి రోజున సుమారు రూ.35 నుంచి 40 కోట్ల మేర వసూలు చేస్తుందని అంచనా. పఠాన్ తర్వాత అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా గదర్-2 నిలుస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు.
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రంలో.. స్మృతీ కౌర్, మనీష్ వాద్వా, గౌరవ్ చోప్రా తదితరులు కీలక పాత్రలో పోషించారు. ఈ చిత్రానికి మిథున్, మోంటీ శర్మ ఇద్దరు సంగీతం అందించారు. ఇక సినిమాటోగ్రఫీ బాధ్యతలు నజీబ్ ఖాన్ నిర్వర్తించారు.