తెలంగాణ

telangana

ETV Bharat / elections

మోదీతో పాటు కొనసాగిన మంత్రుల హవా - modi

సార్వత్రిక సమరంలో భాజపా కీలక నేతలు సత్తా చాటారు. ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలో పని చేసినవారిలో చాలామంది విజయభేరి మోగించారు. ముఖ్యంగా అమేఠీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు.

భాజపా మంత్రుల విజయభేరి

By

Published : May 24, 2019, 9:06 AM IST

భాజపా మంత్రుల విజయభేరి

ప్రధాని నరేంద్రమోదీతో పాటు భాజపా మంత్రివర్గ సభ్యులూ విజయభేరి మోగించారు. కొంతమంది మాజీ అధికారులు, కేంద్రమంత్రులు మనోజ్​ సిన్హా, హర్​దీప్​ పురి, కేజే ఆల్ఫోన్స్​ మినహాయిస్తే మంత్రులందరూ గెలుపు బాట పట్టారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమేఠీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ 55 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

వారణాసిలో మోదీ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. కూటమి అభ్యర్థి, ఎస్పీ నేత షాలినీ యాదవ్​పై 4.79 లక్షల మెజారిటీ సాధించారు మోదీ. గత ఎన్నికలతో పోలిస్తే లక్ష ఓట్లు అధికంగా సాధించారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన జేఎన్​యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్​పై కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్​ 4.22 లక్షల మెజారిటీతో బెగూసరాయ్​ స్థానం నుంచి గెలుపొందారు.

బిహార్​ పట్నాసాహిబ్​లో సిట్టింగ్​ ఎంపీ శతృఘ్న సిన్హాపై కేంద్రమంత్రి రవిశంకర్ ​ప్రసాద్​ 2.84 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. పార్టీలోని కీలక నేతలు రాజ్​నాథ్​ సింగ్, నితిన్​ గడ్కరీతో పాటు మరింత మంది గెలుపు తీరాలకు చేరారు.

అభ్యర్థి సమీప ప్రత్యర్థి స్థానం
రాజ్​నాథ్​ సింగ్ పూనమ్ సిన్హా (ఎస్పీ) లఖ్​నవూ
నితిన్ గడ్కరీ నానా పటోలే (కాంగ్రెస్) నాగ్​పుర్​
రాధామోహన్ సింగ్ ఆకాశ్ సింగ్ పూర్వి చంపారన్​
ఆర్కే సింగ్​ రాజు యాదవ్​ (సీపీఐ) ఆరా
అశ్విని కుమార్ చౌబే జగదానంద్ సింగ్(ఆర్జేడీ) బక్సర్​
రాజ్యవర్ధన్​ సింగ్ రాఠోడ్​ కృష్ణ పూనియా (కాంగ్రెస్) జైపుర్​ గ్రామీణం
అనంత్​ కుమార్ హెగ్దే అనంద్ అస్నోతికర్ ఉత్తర కన్నడ
వీకే సింగ్ సురేశ్ బన్సాల్ (ఎస్పీ) ఘజియాబాద్
మహేశ్ శర్మ సత్యపాల్​ (బీఎస్పీ) గౌతం బుద్ధ నగర్​ (నోయిడా)
మేనకా గాంధీ చంద్ర భద్ర సింగ్​(బీఎస్పీ) సుల్తాన్​పుర్​ (ఉత్తరప్రదేశ్)
సత్యపాల్​ సింగ్ జయంత్ చౌదరి (ఆర్​ఎల్​డీ) బాగ్​పథ్ (ఉత్తరప్రదేశ్​)

ఇదీ చూడండి: నమో ప్రభంజనం... ఎన్డీఏ ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details